శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వెంకీ-త్రివిక్రమ్ మూవీ 

Spread the love

కుటుంబం అంతా  కలిసి కూర్చొని ఆనందించే సినిమాలు చేయడంలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కు ఉన్న ఇమేజ్ గురించి తెలిసిందే. ఫ్యామిలీ ఆడియెన్స్ ఆయన సినిమాలకు భారీగా ఆదరిస్తూ వస్తున్నారు.  మనసును తాకే ఎమోషన్స్, నవ్వులు పంచే కామెడీ ఇలా ఇవన్నీ కలిపి ఆయన సినిమాలు అద్భుతమైన వినోదాన్ని అందిస్తాయి. ప్రస్తుతం ఆయన మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి చేస్తున్న సినిమా  ‘ఆదర్శ కుటుంబం’. ప్రస్తుతం ఈ  సినిమా శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. మేకర్స్ ఇప్పటికే ఈ సినిమాను వేసవిలో విడుదల చేస్తామని ప్రకటించడంతో… ఆ టైమ్‌లైన్‌కు తగ్గట్టుగా పని వేగంగా కొనసాగిస్తున్నారు. ప్రతి రోజు షూటింగ్ సజావుగా సాగుతూ, ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో యూనిట్ ముందుకు సాగుతోంది. తాజాగా ఈ సినిమా యూనిట్ సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో వెంకటేశ్, త్రివిక్రమ్ ఇద్దరూ ఏదో సీరియస్‌గా చర్చిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఈ పిక్ చూసినప్పుడు… సినిమా సెట్స్‌లో ఎంత అంకితభావంతో  పని జరుగుతుందో స్పష్టంగా తెలుస్తోంది. వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో  గతంలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి ఆల్ టైమ్ క్లాసిక్ సినిమాలకు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించారు. ఇప్పుడు ఆయన ఒక స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన తర్వాత వెంకటేశ్‌తో పూర్తి స్థాయి సినిమా చేయడం ఇదే మొదటిసారి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ కలవడం వల్ల… ఇది ఒక డ్రీమ్ కాంబోగా మారింది. అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *