ఆసక్తికరంగా విజయ్ దేవరకొండ కొత్త మూవీ పోస్టర్

Spread the love

విజయ్ దేవరకొండ కొత్త మూవీ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే రవికిరణ్ కోలా డైరెక్షన్ లో ‘రౌడీ జనార్దన’, రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లో ‘రణబాలి’ వంటి రెండు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విజయ్ శౌర్యువ్ డైరెక్షన్ లో కొత్త సినిమాను ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక ఇంటరెస్టింగ్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో మూవీ టీమ్ ను పరిచయం చేశారు. యానిమల్స్, వెపన్స్ తో సినిమా పై ఆసక్తిని పెంచే విధంగా రూపొందించారు. ‘హయ్ నాన్న’ సినిమాతో మంచి హిట్ ను అందుకోవడమే కాకుండా ప్రేక్షకులలో మంచి ఫీల్ గుడ్ సినిమా తీసిన డైరెక్టర్ గా నిలిచాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఏ రేంజ్ మూవీ తీస్తాడోనని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు హేషబ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మరో ఆసక్తికర అంశం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అలెజాండ్రో మార్టినెజ్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియజేయనున్నట్లు తెలుస్తోంది. ఇక విజయ్ నటిస్తున్న రణ బాలి సినిమా సెప్టెంబర్ 11న రిలీజ్ అవనుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *