మరో సారి గుడ్ న్యూస్ చెప్పిన రణవీర్ దీపికా…!

Spread the love

తన అందం, నటన, వ్యక్తిత్వంతో కోట్లాది అభిమానులను సంపాదించుకుని అగ్రనటిగా కొనసాగుతున్నారు  దీపికా పదుకునే. ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో మరో  కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుండటంతో అభిమానులు ఎంతో సంతోషంగా స్పందిస్తున్నారు. ఆమె మరోసారి తల్లి కానున్నట్లు స్వయంగా ప్రకటించారు.  ఈ శుభవార్తను దీపికా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా చాలా ప్రత్యేకంగా షేర్ చేశారు. తమ చిన్నారి కుమార్తె ‘దువా’ చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పట్టుకుని ఉన్న ఒక ఫోటోను పంచుకున్నారు. ఆ కిట్‌లో పాజిటివ్ రిజల్ట్ స్పష్టంగా కనిపించడంతో, ఈ ఫోటోనే చాలా విషయాలను చెప్పేసింది. ఈ వార్తా  అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపింది. ఇక దీపికా – రణ్ వీర్ సింగ్ జంటకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరూ 2024 సెప్టెంబర్ 8న ఈ జంట చిన్నారి ‘దువా’ కి జన్మనిచ్చారు. ఇప్పుడు రెండోసారి గుడ్ న్యూస్ రావడంతో వారి కుటుంబంలో ఆనందం రెట్టింపు అయింది.  ఈ పోస్ట్‌కి సినీ ప్రముఖులు కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా, అనన్య పాండే, సమంత, పరిణీతి చోప్రా, అర్జున్ కపూర్, కరీనా కపూర్ తదితర ప్రముఖులు తమ విషెస్ తెలిపారు. అభిమానులు కూడా కామెంట్లలో ప్రేమను కురిపిస్తూ ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

కానీ దీపికా గురించి మరో ఆసక్తికరమైన విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఆమె ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా చాలా అంకితభావం కనబరుస్తారు. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ తో ‘రాకా’ సినిమాలో నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా దీపికా షూటింగ్ ఆపకుండా కొనసాగిస్తోందట. అంతేకాదు… ఇప్పటికే కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ కూడా పూర్తి చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ఇలాంటి సమయంలో చాలా మంది నటీమణులు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారు. కానీ దీపికా మాత్రం తన వర్క్ కమిట్‌మెంట్‌ను నిలబెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇది చూస్తుంటే ఆమె ఎంత ప్రొఫెషనలిజం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న రెండు సినిమాలు షూటింగ్‌ స్టేజి లో ఉన్నాయి. ఒకటి రాకా ఇంకొకటి షా రుఖ్ ఖాన్ ‘కింగ్’ సినిమా… కాబట్టి మేకర్స్ ముందుగా ఆమెకు సంబంధించిన ముఖ్యమైన సీన్స్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నారట. అంటే దీపికా పాల్గొనాల్సిన సీన్స్‌ను ముందుగా పూర్తి చేసి, తరువాత ఆమె అవసరం లేని సీన్స్‌ను టీమ్ కొనసాగించవచ్చు. ఇలా చేస్తే సినిమా షూటింగ్ మొత్తం ఆలస్యం కాకుండా ముందుకు సాగుతుంది. ఈ విధానం పెద్ద సినిమాల్లో చాలా సాధారణం. మొత్తానికి దీపికా రణవీర్ ఫాన్స్ కి ఇది బెస్ట్ గుడ్ న్యూస్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *