ఈ నెల 21.04.2026 నుండి మూడు రోజుల పాటు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పులివెందులలో పర్యటించనున్నారు. 21న సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 22 ఉదయం 9.00 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి లింగాల మండలం ఇప్పట్ల చేరుకుని ఇటీవల కన్నుమూసిన స్థానిక వైఎస్సార్సీపీ నేత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం పులివెందుల క్యాంప్ కార్యాలయానికి చేరుకుని ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు. ఈ నెల ఉదయం 8 గంటలకు పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు.