ఇదేనా కూటమి ప్రభుత్వ రైతు సంక్షేమ ధ్యేయం ?:షర్మిల

Spread the love

ఆరుగాలం రైతు కష్టం దళారుల పాలవుతోందని రాష్ట్రంలో మొక్కజొన్న రైతులది ఆశనిపాతమని ఏపీసీసీ ఛీఫ్ వై.ఎస్.షర్మిల పేరుకే కనీస మద్దతు ధర. ఆచరణలో మక్కకు మద్దతు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి హామీలు ఘనంగా ఉన్నా ఆచరణ నేటికి శూన్యమని విమర్శించారు.  రెక్కలు ముక్కలు చేసి పంట పండిస్తే.. ధర లేక రైతన్నకు జరుగుతున్నది దారుణ మోసమేనని  కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2400 ఉంటే, మార్కెట్ లో రూ.1500 ధర పెట్టడం ఎంతవరకు న్యాయం ? క్వింటాకు రూ.900 వరకు రైతుకు నష్టం జరుగుతుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా ? లేనట్లా ?  అని ప్రశ్నించారు. ఇదేనా కూటమి ప్రభుత్వ రైతు సంక్షేమ ధ్యేయం ? ధరలో లోటును చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని అడిగారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ప్రత్యేక ప్రైస్‌ డెపిషియన్సీ పేమెంట్‌ (పిడిపి) పథకం రెండేళ్ల కూటమి పాలన రాష్ట్ర రైతాంగానికి నిజంగా పెనుశాపమని సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. 

తక్షణమే మొక్క జొన్న రైతులకు బాసటగా నిలవాలని  ఈ ఏడాది మొక్కజొన్న దిగుబడి రైతులకు చాలా ఆశాజనకంగా ఉందని  4.83 లక్షల హెక్టార్లలో 37.61 లక్షల మెట్రిక్ టన్నుల పంట చేతికొచ్చిందని తెలిపారు.  గిట్టుబాటు ధర లేక రైతుకి ఎకరాకు 25 వేల వరకు నష్టం జరుగుతోంది. మొక్కజొన్న రైతులు దాదాపు 3 వేల కోట్లు నష్టపోతున్నారన్నారు.  ధరలో ఏర్పడిన లోటును చెల్లిస్తామని ఇచ్చిన మాట మేరకు మొక్కజొన్న రైతులకు 3 వేల కోట్లు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం  చెల్లించాలని సీఎం చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *