వైసీపీ  ఎన్ని సార్లు చెప్పినా తన ప్రవర్తన మార్చుకోవడం లేదు:మంత్రి లోకేష్

Spread the love

వైసీపీపై ఏపీ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. తప్పుడు ప్రచారాలకు అలవాటు పడిన వైసీపీ  ఎన్ని సార్లు చెప్పినా తన ప్రవర్తన మార్చుకోవడం లేదని దుయ్యబట్టారు. తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేటలో మార్చి 30న టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం సందర్భంగా సీఎం చంద్రబాబు  ఒక లబ్ధిదారుకు ఇచ్చిన హామీ ని వక్రీకరించి కొందరు అప్పటి లో తప్పుడు ప్రచారం చేశారని అయితే  వారికి AP Government Fact Check ద్వారా వివరణ ఇవ్వడం జరిగిందని అయినా ఇప్పుడు మళ్లీ తాజాగా అదే అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  ఆ రోజు సీఎం చంద్రబాబు ముక్కర అంబిక అనే లబ్దిదారు ఇంటికి వెళ్లి అక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో సీఎం వారికి కొన్ని హామీలు ఇచ్చారు. అంబిక భర్త ఆటో డ్రైవర్ కావడంతో ఆయనకు బ్యాటరీ ఆటో కొనిపెట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ కు ఆదేశాలిచ్చారని లోకేష్ తెలిపారు. ఆ తర్వాత సీఎం ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎదురుగా ఉన్న ఇంటి గడప వద్ద ఉన్న మరొక మహిళ తన కుమారుడి ఉద్యోగం విషయం ప్రస్తావించారు. సీఎం చంద్రబాబు  అంబిక భర్త కు బ్యాటరీ ఆటో కొనిపెట్టాలి అని ఇచ్చిన ఆదేశాలను ఆ మహిళ అడిగిన విషయానికి జత చేసి ‘‘చదువుకున్న వ్యక్తికి ఆటో కొనిపెడతారట’’ అంటూ సోషల్ మీడియాలో అపహాస్యం చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. వీడియోలను తప్పుడు అర్ధం వచ్చేలా ఎడిట్ చేసి ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని  ఇలాంటి ప్రయత్నాలు చేసేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *