తెలంగాణ రాష్ట్ర సేన…కొత్త పార్టీ ప్రకటించిన కవిత

Spread the love

తెలంగాణ రాష్ట్రంలో మరొక రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తమ కొత్త పార్టీని ప్రకటించారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ గా తమ పార్టీ పేరును ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో ఏర్పాటు చేసిన సభలో ఆ పార్టీ పేరును కవిత ప్రకటించారు. ఇక తమ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ కోసం పోరాడామన్నారు.  జాగృతి కార్యకర్తలు తెలంగాణ సాంస్కృతిక దీపాన్ని జాగ్రత్తగా  కాపాడుకున్నారని పేర్కొన్నారు. నేడు నా జీవితంలో మరిచిపోలేని రోజు అవుతుంది. తెలంగాణ భవిష్యత్ రాసుకోవడానికి అందరి భాగస్వామ్యం కావాలని కోరారు. సామాజిక తెలంగాణ కోసం కష్టపడి పని చేయాలన్నారు. పని చేయడం కోసమే తెలంగాణ రాష్ట్ర సేన ప్రజల ముందుకు వచ్చింది. తమ పార్టీ  తీరు ఎలా ఉంటుందో ప్రజలు చూస్తారన్నారు. ప్రజలకు మంచి చేయాలంటే పోరాడితే సరిపోదని రాజకీయ అధికారం ఉండాలి. అది తోడైతేనే ప్రజలకు మంచి చేయగలమన్నారు. బీఆర్ఎస్ సాంకేతికంగా ఉన్నా ఆత్మను కోల్పోయిందని  బీఆర్ఎస్ ఆత్మ కోల్పోయినందుకే తెలంగాణ రాష్ట్ర సేన వచ్చిందన్నారు. అప్పటి కే.సీ.ఆర్ వేరని ఇప్పటి కే.సీ.ఆర్ వేరని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *