రాష్ట్రంలో ఇంధన కొరత అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష

Spread the love

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంధన కొరతతో పెట్రోల్ బ్యాంకుల మూసివేతకు సంబంధించిన అంశంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులు, ఇబ్బందులపై అధికారులతో సీఎం మాట్లాడారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో కో ఆర్డినేట్  చేసుకొని ప్రజలు  ఇబ్బంది పడకుండా  చూడాలని స్పష్టం చేశారు. బంకుల ఓనర్లు, ఇంధన సంస్థలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు.  సీఎం ఆదేశాలతో ఉన్నతాధికారులు అలర్టయ్యారు. ఇంధన సరఫరాపై పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్లో ఫోన్లో చర్చించారు. సత్వరం స్టాక్ లేని  బంకుల వివరాలు అందించాలని ఆదేశించారు. స్టాక్ సమస్య ఉంటే వెంటనే  టోల్ ఫ్రీ నంబర్ 1967కు ఫోన్ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ తెలిపారు. సీఎం ఆదేశాలతో పెట్రోల్ డీలర్ల నుండి  అధికారులు  వివరాలు సేకరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *