రాష్ట్ర గవర్నర్ ను కలిసిన సీఎం చంద్రబాబు

Spread the love

ఏపీ సీఎం చంద్రబాబు నేడు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌ తో సమావేశమయ్యారు. విజయవాడలోని లోక్ భవన్‌లో గవర్నర్‌ ను ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.స్వల్ప అస్వస్థత కారణంగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయిన గవర్నర్ ను సీఎం పరామర్శించారు. లోక్ భవన్ కు వెళ్ళిన సీఎం ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కూడా గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆరోగ్యంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు జగన్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాస్పిటల్ లో చేరారని తెలిసి చాలా ఆందోళన చెందినట్లు పేర్కొన్నారు.  ఆయన త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నట్లు జగన్ పోస్ట్ చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *