ఈ భారీ పాన్ ఇండియా మూవీలో ఆ హీరో?

Spread the love

పాన్ ఇండియా సూపర్  స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా భారతీయ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. సైన్స్ ఫిక్షన్, పురాణాల మేళవింపుతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని అందుకుని భారీ స్థాయిలో  వసూళ్లు సాధించడం ద్వారా సంచలనాన్ని సృష్టించింది. కేవలం వసూళ్ల పరంగా మాత్రమే కాదు, కథ చెప్పే విధానం, విజువల్స్, క్యారెక్టర్ డిజైన్ అన్ని కలిపి ఈ సినిమాను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లాయి. అందుకే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం ముగిసిన తీరు చూస్తేనే రెండో భాగం ఏ రేంజ్ లో  ఉండబోతోందో అర్థమవుతుంది. నటీనటుల విషయానికి వస్తే, ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరిద్దరి మధ్య కొన్ని పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇది నిజమైతే, ఆ సన్నివేశాలు సినిమా హైలైట్‌గా నిలిచే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇంట్రడక్షన్ లో ఫైట్ సీక్వెన్స్ చెప్పాము కదా… అదే ఇది అనమాట… వీరితో పాటు దుల్కర్ సల్మాన్, జేడీ చక్రవర్తి వంటి నటులు కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారని సమాచారం. ఇలా భారీ తారాగణంతో ఈ సినిమా రూపొందుతోంది. మొదటి భాగంలోనే ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఉండగా, ఇప్పుడు రెండో భాగంలో మరిన్ని సర్ప్రైజ్ ఎంట్రీలు ఉంటాయని టాక్ రావడం ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. ఇక తాజాగా వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన వార్త ఏమిటంటే, ఈ సినిమాలో ఒక కీలకమైన స్పెషల్ రోల్ కోసం తమిళ స్టార్ హీరో శింబును సంప్రదించినట్లు టాక్ నడుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఇది నిజమైతే, ఇది పాన్ ఇండియా లెవెల్లో మరొక పెద్ద సర్ప్రైజ్ అవుతుంది. శింబుకు తమిళ ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ ఈ సినిమా మార్కెట్ మరింత విస్తరించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే కల్కి మొదటి భాగం పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించగా, రెండో భాగంలో ఇలాంటి స్టార్ ఎంట్రీలు ఉంటే సినిమా రేంజ్ మరింత పెరగడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *