‘3 ఇడియట్స్’ సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ 

Spread the love

2009లో విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను మరీ ముఖ్యంగా యువతను విశేషంగా ఆకట్టుకున్న సినిమా ‘3 ఇడియట్స్’. ఈ క్రేజీ మూవీకి సీక్వెల్ రాబోతున్నట్లు ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా దీనిపై స్పష్టత వచ్చేసింది.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ సీనియర్ టాప్ హీరో ఆమిర్ ఖాన్ దీనిపై స్పందించారు. ఈ ప్రాజెక్ట్పై దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ పనిచేస్తున్నారని ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉందని స్పష్టం చేశారు. డైరెక్టర్ ప్రస్తుతం ‘3’ ఇడియట్స్’ సీక్వెల్ పై  పనిచేస్తున్నారు. నేను కథ విన్నాను. అద్భుతంగా ఉంది. స్క్రీన్ ప్లేకి ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంది.  ఈ సీక్వెల్లో మొదటి చిత్రంలోని కామెడీని మిస్ కాకుండా పదేళ్ల తర్వాత పాత్రల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో కథ రూపొందనుందని తెలిపారు. తిరిగి ఇందులో ఆయన పాత్రను పోషించడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. 2009లో విడుదలైన ‘3 ఇడియట్స్’ సినిమాలో ఆమిర్, ఆర్. మాధవన్, శర్మన్ జోషి, కరీనా కపూర్, బోమన్ ఇరానీ  ముఖ్య పాత్రల్లో కనిపించారు.  ఇక దాదాసాహెబ్ ఫాల్కే జీవిత చరిత్ర ఆధారంగా హిరాణీతో తాను చేయబోయే చిత్రం స్క్రిప్ట్ కారణంగా వాయిదా పడినట్లు ఆయన తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *