ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారీ సినిమా ‘టాక్సిక్’ మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని ఆ సినిమా హీరో యష్ ఒక ప్రకటనలో తెలిపారు. మనం నిర్మించే సినిమాలు కొన్ని అయితే, మనం అసలు సినిమాను ఎందుకు ప్రేమిస్తున్నామో గుర్తుచేసే సినిమాలు మరికొన్ని ఉంటాయి. ‘టాక్సిక్’ (Toxic) అటువంటి ఒక అద్భుతమైన ప్రయాణం. సినీమాకాన్ లో మా చిత్రాన్ని ప్రదర్శించినప్పుడు వచ్చిన అనూహ్యమైన ప్రపంచ స్థాయి స్పందన చూశాక, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తన పూర్తి సామర్థ్యాన్ని చాటుకోవాలనే మా నమ్మకం మరింత బలపడింది.
‘టాక్సిక్’ చిత్రీకరణ పూర్తయింది, ప్రస్తుతం మేము ప్రపంచ స్థాయి పంపిణీ మరియు భాగస్వామ్యాలను సమన్వయం చేసే పనిలో ఉన్నాము. ఈ నేపథ్యంలో, సినిమా విడుదల సమయాన్ని మార్చాలని మేము నిర్ణయించుకున్నాము. ఇదివరకు ప్రకటించినట్లుగా జూన్ 4న ఈ చిత్రం విడుదల కావడం లేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదలయ్యేలా త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తాము. ‘టాక్సిక్’ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
భారతీయ సినిమా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటూ ప్రపంచ వేదికపై అడుగుపెడుతున్న ఈ సమయంలో, ప్రమాణాలను పెంచాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఒక నటుడిగా, నిర్మాతగా.. ఈ చిత్రాన్ని ఉండాల్సిన స్థాయి ఇంపాక్ట్‌తో ప్రపంచానికి పరిచయం చేయడానికి తగిన సమయం తీసుకోవడం, భారతీయ చిత్ర పరిశ్రమ కోసం నేను చేయగలిగిన పనిగా భావిస్తున్నాను. ప్రతి అడుగులోనూ, ప్రతి మార్పులోనూ మీ మద్దతు నాకు తోడుగా నిలిచింది, అందుకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని. కొన్ని కథలకు సహనం అవసరం, కొన్ని ప్రయాణాలు దాన్ని కోరుకుంటాయి. మీరు గర్వంగా జరుపుకోగలిగేలా, భారతీయ సినిమా గర్వించేలా ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.