డిజిటల్ అరెస్ట్” మోసాలతో జాగ్రత్త..ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:కేంద్రమంత్రి పెమ్మసాని 

Spread the love

డిజిటల్ అరెస్ట్” మోసాలతో జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక ఆసక్తికర వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు “డిజిటల్ అరెస్ట్” పేరుతో కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారని పోలీసు అధికారులు లేదా ప్రభుత్వ ప్రతినిధులుగా నటిస్తూ వీడియో కాల్స్ ద్వారా ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అజ్ఞాత కాల్స్, సందేహాస్పద లింకులు, OTPలు – ఎప్పటికీ షేర్ చేయవద్దని తెలిపారు. ఏదైనా అనుమానం కలిగితే వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించండి లేదా 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని సూచించారు. స్మార్ట్‌గా ఉండండి… సురక్షితంగా ఉండండి.ఒక్క క్లిక్ మీ భవిష్యత్తును మార్చొచ్చు – జాగ్రత్తగా ఆలోచించాలని పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *