నేటి ట్రేడింగ్ లో భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

Spread the love

నేటి ట్రేడింగ్ లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్లాయి.  నిన్నటి సెషన్‌ లో నష్టాలతో నేల చూపులు చూసిన సూచీలు ఈరోజు లాభాలతో కోలుకున్నాయి. నిన్నటి నష్టాల తర్వాత మదుపర్లు కొనుగోళ్ల ఆసక్తికనబరచడం, దేశీయ కంపెనీల నుండి వస్తున్న ఆశాజనక త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ కు జోష్ ఇచ్చాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 609 పాయింట్లు లాభంతో 77,496 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 181 పాయింట్లు లాభపడి  24,177 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.94.78గా కొనసాగుతోంది. ఇక అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు మరియు ముడి చమురు ధరల పెరుగుదల వంటి కారణాలు కూడా మార్కెట్‌లపై కొంత ప్రభావం చూపాయి. ఫలితంగా కొన్ని రంగాల షేర్లు కొంత అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.  మారుతీ సుజుకి, టాటా మోటార్స్, కోల్ ఇండియా, రిలయన్స్ తదితర షేర్లు లాభాల్లో కొనసాగాయి.  యూఏఈ దేశం ఒపెక్ (OPEC) నుండి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలు, ముడి చమురు సప్లైకు సానుకూల ప్రభావం చూపుతాయన్న అంచనాలు మార్కెట్‌ కు కొంతమేర కలిసొచ్చాయి. అయితే, అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరియు ముడి చమురు ధరలు ఇంకా 110 బ్యారెల్ పైన ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *