ఇరాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ వేదిక ఒక ఆసక్తికర ఫోటో పోస్ట్ చేశారు. ఒక పెద్ద గన్ ను పట్టుకుని ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. నో మోర్ మిస్టర్ నైస్ గై అనే క్యాప్షన్ ను ఆ ఫొటోకు జత చేశారు. ఇరాన్ తన వ్యవహారాలను చక్కదిద్దుకోలేకపోతోంది. అణురహిత ఒప్పందం (nonnuclear deal) మీద ఎలా సంతకం చేయాలో వారికి తెలియడం లేదు. వారు త్వరగా తెలివిగా వ్యవహరించడం మంచిదంటూ హెచ్చరికలు చేశారు. అణు కార్యక్రమానికి సంబంధించి సరైన పరిష్కారం త్వరలో లభించకుంటే అమెరికా వైఖరి కఠినంగా ఉండబోతుందన్నట్లు స్పష్టం చేశారు. అమెరికా మరియు ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం సద్దుమణగాలనేదే ప్రపంచం మొత్తం కోరుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల పలు దేశాల్లో ఇంధన సరఫరాకు ఆటంకం కలుగుతోంది. కొన్ని దేశాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగిపోయి, సామాన్య ప్రజల రవాణా ఖర్చులు భారాన్ని మోయలేకపోతున్నారు. ఇక యుద్ధం కోసం అమెరికా ప్రభుత్వం చేసే భారీ ఖర్చుల వల్ల ఆ దేశంపై ఆర్థిక భారం పెరుగుతుంది, ఇది పరోక్షంగా పౌరుల పన్నులు లేదా ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ప్రభావం చూపవచ్చనే వాదన వినిపిస్తోంది.