హైదరాబాద్ వరుస గెలుపులకు బ్రేక్…కోల్ కతా నైట్ రైడర్స్ విజయం 

Spread the love

ఈ ఐపీఎల్ సీజన్ లో ఆడిన గత 5 మ్యాచ్ లలో విజయాలు సాధించి జోరు మీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్ తాజాగా జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం చెందింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ మొదట బ్యాటింగ్ ఎంచుకుని 19 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌటైంది. మొదట భారీ స్కోరు చేసే విధంగా కనిపించినా కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయి తడబడింది. ట్రావిస్ హెడ్ 61 (28; 9×4, 3×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇషాన్ కిషన్ 41 (29; 4×4, 2×6) పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అభిషేక్ శర్మ (15), క్లాసీన్ (11),స్మరన్ రవిచంద్రన్ (4), అనికేత్ వర్మ (6), సలీల్ అరోరా (2), పాట్ కమ్మిన్స్ (10) విఫలమయ్యారు. కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, కార్తీక్ త్యాగి 2 వికెట్లు, సునీల్ నరైన్ 2, వైభవ్ అరోరా, వైభవ్ అరోరా, కామెరూన్ గ్రీన్, అనుకూల్ రాయ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం టార్గేట్ ఛేజింగ్ లో కోల్ కతా ఎక్కడా తడబడకుండా ఆడింది. అంగ్క్రిష్ రఘువంశీ 59 (47; 5×4, 2×6) టాప్ స్కోరర్. అజింక్య రహానే 43 (36; 4×4, 1×6) పరుగులు చేశాడు. ఫిన్ అలెన్ (29), రింకు సింగ్ (22 నాటౌట్) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో పాట్ కమ్మిన్స్, శివాంగ్ కుమార్, సాకిబ్ హుస్సేన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అన్ని విభాగాల్లో హైదరాబాద్ కంటే కోల్ కతా మెరుగైన ప్రదర్శన కనబరిచి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *