టేబుల్ టాపర్ పంజాబ్ కు మరో ఓటమి 

Spread the love

ఈ సీజన్ లో టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్ కు తాజాగా రెండో ఓటమి ఎదురైంది. తాజాగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో పంజాబ్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. సూర్యాంశ్ షెడ్గే 57 (29; 3×4, 5×6) హాఫ్ సెంచరీతో మంచి ప్రదర్శన కనబరిచాడు. మార్కస్ స్టోయినీస్ 40 (31; 5×4, 1×6), మార్కో జెన్సెన్ (20), శ్రేయాస్ అయ్యర్ (19), ప్రభ్ సిమ్రన్ (15) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 4 వికెట్లు, మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు, కగిసో రబడా 2 వికెట్లు, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 57(41; 5×4, 1×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. వాషింగ్టన్ సుందర్ (40 నాటౌట్), జాస్ బట్లర్ (26) పరుగులతో ఆకట్టుకున్నారు. పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ వైషాక్ 2వికెట్లు, అర్షదీప్ సింగ్ 2 వికెట్లు, మార్కో జెన్సెన్ 1 వికెట్, మార్కస్ స్టోయినీస్ 1 వికెట్ పడగొట్టారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *