ఎన్నికల కోసం ఒక మనిషిని ఎంతలా ఏడిపించాలో అంతలా ఏడిపించారు… ఒక వైపు సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన జన నాయకన్ సినిమాని ఆపేసారు… ఎందుకు ఆపేసారు ఆంటే క్లారిటీ లేదు. సెన్సార్ ఇష్యూస్ అన్నారు. అటు పర్సనల్ లైఫ్ ని కూడా వదిలిపెట్టకుండా విమర్శలు గుప్పించారు. కానీ విజయ్ నిలబడ్డాడు. యువ ఓటర్లు భారీగానే ప్రభావం చూపారు. ఎలక్షన్ వోటింగ్ శాతం తెలుసు కదా. దాదాపుగా 90 శాతం వచ్చింది. అంటె రాష్ట్రం లోని యువత తలచుకుంటే గవర్నమెంట్ మారిపోక తప్పదు… అలాగే మనకి వచ్చిన ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ లో కూడా ఒకే ఒక్క సంస్థ విజయ్ గెలుపు ని అంచనా వేసింది… కానీ ఆ ఒక్క పోల్ ఏ ఇప్పుడు కరెక్ట్ అయ్యింది…ఇది విజయ్ అంటె… గెలుపు అంటె ఇది… రాష్ట్రాన్ని డీఎంకే ఇంకా ఏఐడీఎంకే రెండు పాలించాయి… అయితే ఇక ఈసారి జయలలిత మెచ్చిన విజయ్ రంగంలోకి దిగాడు… కొట్టాడు… గట్టిగా కొట్టాడు… ఇది కదా దెబ్బ అదుర్స్ కదూ…ఐతే ఇప్పుడు ఏ విజయం జన నాయకన్ సినిమా రాత మారుస్తుందా??? భారీ అంచనాల మధ్య ప్రారంభమైన ఈ సినిమా, విడుదల దశకు చేరుకునే సరికి అనేక అడ్డంకులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. మొదట సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం, ఇప్పటికీ థియేటర్లలోకి రాకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకు మొదటినుంచే సెన్సార్ సమస్యలు తలెత్తాయి. కథలో ఉన్న కొన్ని రాజకీయ అంశాలు, సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో సెన్సార్ ప్రక్రియ ఆలస్యం అయింది. కొన్ని కట్స్ చేయాలని సూచించడంతో చిత్ర యూనిట్ సెన్సార్ బోర్డు మధ్య చర్చలు జరిగాయి. ఈ వివాదం చివరకు కోర్టుల వరకు వెళ్లింది. దీంతో సినిమా విడుదల మరింత ఆలస్యం అయింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం, ఒక్కో అడ్డంకిని దాటుకుంటూ వచ్చినప్పటికీ, విడుదల తేదీ మాత్రం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంది.
ఈ సమస్యలను అధిగమించి సినిమా విడుదలకు సిద్ధమవుతుందనుకున్న సమయంలో మరో కొత్త సమస్య ఎదురైంది. తమిళనాడులో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో, సినిమా విడుదలపై ప్రభావం పడింది. ఎన్నికల సమయంలో పెద్ద సినిమాల విడుదలకు పరిమితులు ఉండటంతో, ‘జననాయగన్’ మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే ఆలస్యమవుతూ వచ్చిన ఈ సినిమా, మరోసారి ఆగిపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఇంతలోనే మరో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. సినిమా థియేటర్లలో విడుదల కాకముందే, పైరసీ రూపంలో సోషల్ మీడియాలో కనిపించడం పెద్ద వివాదానికి దారి తీసింది. కొన్ని కీలక సన్నివేశాలు, వీడియో క్లిప్స్ బయటకు రావడంతో నిర్మాతలకు భారీ నష్టం జరిగే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు స్పందించి, చిత్ర యూనిట్‌కు మద్దతుగా నిలిచారు. పైరసీకి పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేయడం కొంత ఉపశమనాన్ని కలిగించినా, సినిమా ఇమేజ్‌పై ప్రభావం పడినట్టే అయింది. ఇలాంటి సమస్యల మధ్య సినిమా విడుదలపై ఇంకా స్పష్టత రాకపోవడం వల్ల, ప్రేక్షకుల్లో ఆసక్తితో పాటు అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. అయితే ఎన్నికల ఫలితాలు ఇప్పుడు వెలువడిన తరువాత, చిత్ర యూనిట్ కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.