నటసింహం నందమూరి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కబోయే NBK 112 ప్రాజెక్ట్ గురించి టాలీవుడ్ లో ఇప్పటికే భారీ చర్చ మొదలైంది. ఈ ఇద్దరి కలయిక అంటేనే మాస్, ఎమోషన్, స్ట్రాంగ్ మెసేజ్ అన్ని కలిసి ఒక ప్యాకేజ్‌గా వస్తాయని ప్రేక్షకులు భావిస్తున్నారు. అందుకే ఈ సినిమా అనౌన్స్ అయిన క్షణం నుంచే నందమూరి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు రావడంతో ఈ ప్రాజెక్ట్ మరింత హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే, ఈ సినిమాకు సంగీత దర్శకుడి విషయంలో ఒక పెద్ద మార్పు జరగబోతుందనే వార్త. గత కొన్ని సంవత్సరాలుగా బాలకృష్ణ సినిమాలకు ఎస్.ఎస్. థమన్ ఒక విధంగా ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిపోయారు. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి సినిమాల్లో ఆయన అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఊపేసింది. బాలయ్య మాస్ ఇమేజ్‌కు తమన్ ఇచ్చే ఎలివేషన్స్ ప్రత్యేకంగా నిలిచాయి. అందుకే ఈ కాంబినేషన్ సక్సెస్ ఫార్ములాగా మారిపోయింది.అయితే NBK 112 కోసం మాత్రం ఈ సారి మార్పు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇది నిజమైతే బాలయ్య కెరీర్లో ఒక కొత్త కాంబినేషన్ అదరగొడుతుందని అభిమానులు భావిస్తున్నారు.ఇక కొరటాల శివ గురించి మాట్లాడుకుంటే మంచి కథలతో తనదైన టేకింగ్ తో ప్రేక్షకులను అలరిస్తుంటారు. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ వంటి విజయవంతమైన సినిమాలతో ఆకట్టుకున్నారు. సినిమాల్లో ఎక్కువగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వీరిద్దరి కాంబినేషన్ కూడా టాలీవుడ్లో ఒక సక్సెస్ఫుల్ జోడీగా నిలిచింది.అయితే ‘దేవర’ సినిమాతో కొరటాల శివ తొలిసారి అనిరుధ్‌తో పనిచేశారు. ఆ సినిమాలో అనిరుధ్ ఇచ్చిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమా మొత్తం నడిపించినట్టే అయింది. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.