తమిళనాడు సీఎం స్టాలిన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం చవిచూశారు. కొళత్తూర్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఆయన మీద టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 9వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. కొళత్తూరు నుండి వరుసగా మూడుసార్లు గెలిచిన సీఎం ఈ ఎన్నికల్లో ఓటమి చెందారు. 1996 తర్వాత స్టాలిన్ ఓడిపోవడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ టీవీకే గ్రాండ్ విక్టరీ కొట్టింది. స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ మాత్రం ముందంజలో కొనసాగుతున్నారు. డీఎంకేకు కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంలో డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్ వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. తాజా ఎన్నికల్లోనూ గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారు. కానీ అనూహ్యంగా కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్ పార్టీ టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఓటమి పాలవడం ఆ పార్టీ శ్రేణులకు మింగుడుపడని విషయమే. ఇక తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలుండగా..మేజిక్ ఫిగర్ 118 ప్రస్తుతం ఏ పార్టీ సొంతంగా ప్రభుత్వం స్థాపించే పరిస్థితి కనిపించడం లేదు. టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా 100కు పైగా స్థానాల్లో కొనసాగుతోంది.