కేరళలో UDF విజయం..స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్

Spread the love

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF విజయం సాధించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ స్పందించారు. నిర్ణయాత్మకమైన తీర్పునిచ్చిన కేరళలోని నా సోదర సోదరీమణులందరికీ ధన్యవాదాలు అంటూ రాహుల్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అత్యంత కష్టపడి, క్రమశిక్షణతో ప్రచారాన్ని నిర్వహించిన ప్రతి ఒక్క UDF నాయకుడికి మరియు కార్యకర్తకు  అభినందనలు తెలిపారు. నేను గతంలో చెప్పినట్లుగానే, కేరళకు అద్భుతమైన ప్రతిభ ఉంది, కేరళకు గొప్ప సామర్థ్యం ఉందని  ఇప్పుడు ఆ రెండింటిని సద్వినియోగం చేసుకోగల స్పష్టమైన దార్శనికత కలిగిన UDF ప్రభుత్వం కేరళకు లభించిందని పేర్కొన్నారు.త్వరలోనే నా కేరళ కుటుంబాన్ని కలుసుకోవాలని ఆశిస్తున్నాను అంటూ రాహుల్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *