సందిగ్దతకు తెర…ఆ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోన్న టీవీకే

Spread the love

తమిళనాట తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నడుస్తున్న సందిగ్దతకు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. మూడురోజులుగా సాగుతున్న ఉత్కంఠ ముగుస్తున్నట్లు కనిపిస్తున్నాయి.  ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తోన్న టీవీకే అధినేత విజయ్ చిన్న పార్టీలతో జరిపిన చర్చలు ఫలించినట్లు సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీవీకేకు సప్పోర్ట్ చేసేందుకు వామపక్షాలతో పాటు, వీసీకే అంగీకరించాయి. దీంతో మెజార్టీ మార్క్ ను అందుకున్న విజయ్ ఈరోజు  మరోసారి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిసేందుకు రెడీ అయ్యారు. విజయ్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ విజయ్ కి మద్దతు తెలిపిన విషయం విదితమే. లెఫ్ట్, కాంగ్రెస్, వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కి చేరనుంది. ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 సీట్లు సాధించింది. అయితే, అందులో విజయ్ రెండు చోట్లా గెలవడంతో సంఖ్యాబలం 107గా మారింది. మద్దతిచ్చిన పార్టీలకు మంత్రిపదవులు ఇవ్వాలని విజయ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కు  రెండు, సీపీఐ, సీపీఎం, వీసీకేకు ఒక్కో మంత్రిపదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు నెంబర్స్ చూసుకుంటే టీవీకే 107, కాంగ్రెస్ 5, సీపీఐ 2, వీసీకే 2, సీపీఎం 2 సీట్లతో ఉన్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *