మరోసారి ఒకే స్క్రీన్ పైన ఎన్టీఆర్-చరణ్

Spread the love

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాలో ఒకే సినిమాలో కలిసి నటించారు. అగ్రహీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్. రామ్‌గా చరణ్, భీమ్‌గా ఎన్టీఆర్ తమ అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించారు. ఆ సినిమా తర్వాత ఈ ఇద్దరు స్టార్ హీరోలను మళ్లీ ఏదో ఒక రూపంలో కలిసి చూడాలని అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ కోరికను నిజం చేసేలా ఒక భారీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థమైత్రీ మూవీ మేకర్స్ అభిమానులకు ఒక ప్రత్యేకమైన సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదల సందర్భంగా, మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ – దర్శకుడు ప్రశాంత్ నీల్  కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్‌ ను థియేటర్లలో ప్రదర్శించే ఆలోచనలో మైత్రీ మూవీ మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఈ వార్త బయటకు వచ్చిన దగ్గర నుంచే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా మొదలైంది. ఒకవైపు రామ్ చరణ్ సినిమా, మరోవైపు ఎన్టీఆర్ పవర్‌ఫుల్ గ్లింప్స్… ఈ రెండు కలిసి థియేటర్లలో కనబడితే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఇప్పటి నుంచే ఊహించుకుంటున్నారు. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘పెద్ది’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఒక ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రోమోస్ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇలాంటి సమయంలోనే ‘డ్రాగన్’ గ్లింప్స్‌ను ‘పెద్ది’తో జతచేయబోతున్నారనే వార్త మరింత హైప్‌ను తీసుకొచ్చింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఈ గ్లింప్స్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అభిమానుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ వీడియోలో ఎన్టీఆర్‌ను చాలా పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారట. ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే మాస్ ఎలివేషన్స్, డార్క్ విజువల్స్, హై వోల్టేజ్ యాక్షన్, గూస్‌బంప్స్ ఇచ్చే డైలాగ్స్ గుర్తుకొస్తాయి. ఇప్పుడు అదే స్టైల్‌లో ఎన్టీఆర్‌ను ఎలా చూపించబోతున్నారో చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఈ గ్లింప్స్‌ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలుస్తోంది. ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో ఎన్టీఆర్ కనిపిస్తారని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే #DragonGlimpse, #NTRNeel, #Peddi వంటి హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *