ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ షేర్ చేసిన ఒక స్టైలిష్ ఫోటో ఎన్టీఆర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బ్లాక్ అండ్ వైట్‌లో కనిపించిన ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట సెన్సేషన్‌గా మారిపోయింది. ఈ ఫోటోలో ఎన్టీఆర్ పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించారు. సరికొత్త హెయిర్ స్టైల్, స్టైలిష్ గడ్డం, కళ్లలో ఇంటెన్స్ లుక్ తో ఒక పవర్ ఫుల్ మాస్ వైబ్ తో తారక్ అదరగొడుతున్నారు. ముఖ్యంగా ఆయన మరింత సన్నగా, ఫిట్‌గా కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఒక్క ఫోటోతోనే తారక్ అభిమానుల్లో భారీ ఎక్సైట్మెంట్ మొదలైంది. ముఖ్యంగా ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ ఫోటోలో కనిపించిన లుక్ అదే సినిమాకి సంబంధించినదేనని అభిమానులు భావిస్తున్నారు. అయితే మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా… సోషల్ మీడియాలో మాత్రం “ఇదే డ్రాగన్ లుక్” అంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తారక్ ఈ లుక్‌లో కనిపించిన తీరు చూస్తుంటే… ఆయన పాత్ర చాలా రఫ్ అండ్ రగ్డ్‌గా ఉండబోతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఫోటోను షేర్ చేసిన థమన్ పై కూడా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్టీఆర్ థమన్ మధ్య ఉన్న అనుబంధం గురించి టాలీవుడ్ లో చాలామందికి తెలిసిందే. గతంలో తారక్ నటించిన పలు సినిమాలకు థమన్ సంగీతం అందించారు. బాద్ షా, రామయ్య వస్తావయ్యా, రభస, అరవింద సమేత వీర రాఘవ వంటి చిత్రాలకు ఆయన ఇచ్చిన సంగీతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తారక్ మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో థమన్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక ప్రస్తుతం తారక్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్‌పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ‘డ్రాగన్’ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.