ప్రధాని మోడీ ఆత్మీయంగా పలకరించిన ఈ పెద్దాయన ఎవరో తెలుసా?

Spread the love

పశ్చిమ బెంగాల్‌ లో మొట్టమొదటి బిజెపి ప్రభుత్వం నేడు కొలువుదీరింది. ఆ రాష్ట్ర సీఎంగా  సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. వేదికపైన ఒక సీనియర్ నేతకు మోడీ ప్రణామాలు చేసి ఆత్మీయంగా పలరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆయన ఎవరు అని చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై ప్రధాని మోడీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. బెంగాల్ లో బీజేపీ ప్రమాణ స్వీకారం చేస్తున్న ఈ రోజున, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీని మరియు దేశానికి, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌కు ఆయన అందించిన చిరస్మరణీయ సేవలను మనమందరం స్మరించుకోవడం చాలా సహజం. ఆయన స్వప్నాలను  సాకారం చేయడానికి కృషి చేస్తామని స్పష్టం చేసిన ప్రధాని కోల్‌కతాలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో మాఖన్‌లాల్ సర్కార్ గారిని కలిశాను. అంకితభావం కలిగిన దేశభక్తుడైన సర్కార్ గారు డాక్టర్ ముఖర్జీతో కలిసి పనిచేశారని ప్రధాని మోడీ తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆయన సహచరుడిగా ఉన్న సమయంలో అరెస్టు కూడా అయ్యారని తెలిపారు. పశ్చిమ బెంగాల్ అంతటా మన పార్టీ పునాదులను విస్తరించడానికి మరియు అన్ని వర్గాల ప్రజలను పార్టీలో చేరేలా ప్రేరేపించడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని మోడీ తెలిపారు. బిజెపి కార్యకర్తలుగా, ప్రజల మధ్య ఉంటూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేసిన ఇటువంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు బీజేపీలో ఉన్నందుకు గర్విస్తున్నట్లు పేర్కొన్నారు. తమ పార్టీలో ఉన్న నేతలను, కార్యకర్తలను  గుర్తించే తీరు గౌరవించే తీరు మిగతా పార్టీలతో పోల్చి చూస్తే ఎంతో ప్రత్యేకమని బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. అలాగే ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి చూపిన ఈ గౌరవానికి నెటిజన్లు దటీజ్ బీజేపీ..దటీజ్ మోడీ అంటూ కామెంట్స్ చేస్తూ ఫిదా అవుతున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *