చైనాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఇండియన్ ఆర్మీ

Spread the love

ఏదో చేసి బల ప్రదర్శన చేద్దామంటే ఇండియన్ ఆర్మీ ముందు కుదరదు. చైనా సైనికులు ఇటీవల మంచు దట్టంగా కురుస్తున్న ప్రదేశాలలో వారు మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు ఇచ్చి కాస్త బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేశారు.  అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులు సాధారణ మనుషులకు ఎంతో ప్రమాదకరంగా ఉంటాయి.  మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలలో వారు విన్యాసాలు చేశారు. శరీరాన్ని కప్పి ఉంచే మందమైన దుస్తులు లేకుండా  షార్ట్ ధరించి వారు ఈ విన్యాసాలు ప్రదర్శించారు. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాలనే దుర్బుద్ధితోనే వారు ఈ వీడియోలను రికార్డు చేసి విడుదల చేశారు. ఈ దెబ్బతో అంతర్జాతీయ మీడియాలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన ఆ వీడియోల చూసి కొందరు తొందరపాటు వ్యాఖ్యలు చేశారు. భారత సైనికులు ఈ కఠినమైన సవాల్‌ను ఎదుర్కొనలేరని కొందరు అసంబద్ధమైన ప్రచారాలు చేశారు. అయితే, మన సైనికులు మాటలతో కాకుండా చేతల్లో చూపించారు. సముద్ర మట్టానికి సుమారు 18  వేల అడుగుల ఎత్తులో ఉన్న మంచు కొండల ప్రాంతంలో సత్తా చాటారు. ఎముకలు కొరికే మంచు తుఫానులు వీస్తున్నప్పటికీ, మన సైనికులు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. చొక్కాలు పూర్తిగా తొలగించి, కేవలం ఒంటి మీద ఎలాంటి రక్షణ లేని దుస్తులతో గంటల తరబడి అలాగే కూర్చున్నారు. బయట మైనస్ డిగ్రీలలో ఉష్ణోగ్రత పడిపోతున్నా వారి శరీర ఉష్ణోగ్రత మాత్రం ఏమాత్రం తగ్గలేదు.  భారతీయ సంప్రదాయమైన యోగాసనాలను ఎంతో ప్రశాంతంగా, ఏకాగ్రతతో ప్రదర్శించారు. కఠినమైన ఆసనాలు వేస్తూ తమ శరీరంలోని అంతర్గత శక్తిని పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకున్నారు. గంటల కొద్దీ నిరంతరం మంచు కురుస్తున్నా వారు కదలకుండా అలాగే ధ్యానంలో లీనమయ్యారు. తమ మానసిక స్థైర్యంతో ఎటువంటి పరిస్థితులనైనా ఎలా అధిగమించవచ్చో మరోసారి ప్రత్యక్షంగా నిరూపించారు. ఏడాది పొడవునా ప్రాణాలను హరించే చలిగాలులు వీస్తూనే ఉంటాయి. ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండే ఆ ప్రాంతంలో సాధారణ వ్యక్తులు కొన్ని నిమిషాలు కూడా జీవించడం అసాధ్యం. అటువంటి చోట విధులు నిర్వర్తించే సైనికులకు ప్రభుత్వం ప్రత్యేకమైన వసతులు కల్పిస్తూ ఉంటుంది. వైద్య బృందాలు ఎప్పటికి అప్పుడూ వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్సిస్తూనే ఉంటాయి. చైనా చేసిన మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనకు మన సైనికులు యోగా ద్వారా ఇచ్చిన సమాధానం చరిత్రలో నిలిచిపోతుంది. కృత్రిమమైన విన్యాసాల కంటే సహజమైన యోగా శక్తి ఎంత గొప్పదో ప్రపంచ దేశాలు ఇప్పుడు అర్థం చేసుకున్నాయి. కేవలం ప్రచార ఆర్భాటాల కోసం చేసే పనులకు, దేశ భక్తితో చేసే త్యాగాలకు చాలా తేడా ఉంటుందని స్పష్టమైంది. అంతర్జాతీయ మీడియా సైతం భారత సైనికుల ఈ సాహసాన్ని కొనియాడుతూ ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. పూర్తిగా నిజమైన వాతావరణంలో మన వాళ్ళు ఈ ప్రదర్శన ఇచ్చారు. చైనాకు చెందిన రక్షణ రంగ నిపుణులు సైతం మన సైనికుల ఈ అసాధారణ శక్తిని చూసి ఆశ్చర్యపోయారు. ఎటువంటి ఆధునిక రక్షణ వస్త్రాలు లేకుండా కేవలం మానసిక బలంతో చలిని ఓడించడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ పరిణామాలు చైనా దేశాన్ని తీవ్రమైన ఆత్మరక్షణలో పడేశాయి. కేవలం శత్రువులతో పోరాడటమే కాకుండా, వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఇలాంటి ఘనతలు సాధించడం గొప్ప విషయం. పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడే శత్రుదేశాలకు మన సైనికులు ఈ విధంగా శాంతియుతమైన పద్ధతిలోనే గట్టి గుణపాఠం నేర్పించారు. చైనా మార్షల్ ఆర్ట్స్ తో విన్యాసాలు చేస్తే మనకు మాత్రమే సాధ్యమైన యోగాతో మన సైనికులు డ్రాగన్ దేశానికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *