స్టూడెంట్స్ కు గూగుల్ గుడ్ న్యూస్..వన్ ఇయర్  ఏఐ ప్లస్ ఫ్రీ

Spread the love

స్టూడెంట్స్ కోసం టెక్ జెయింట్ గూగుల్ ఒక మంచి ఆఫర్ ఇచ్చింది. గూగుల్ ఏఐ ప్లస్ సబ్స్క్రిప్షన్ ను ఒక సంవత్సరం  ఫ్రీగా ఇవ్వనున్నట్లు తెలిపింది. గూగుల్ ఏఐ అసిస్టెంట్, సెర్చ్ ద్వారా ఎడ్యుకేషనల్ టూల్స్ అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొంది. బ్యాక్-టూ-స్కూల్ సీజన్ వచ్చేసింది! ఈరోజే ప్రారంభమవుతున్న ఆఫర్ ద్వారా అర్హత కలిగిన కాలేజీ విద్యార్థులు ఒక పూర్తి సంవత్సరం ఉచితంగా Gemini ప్రయోజనాలను పొందవచ్చు. US విద్యార్థులకు కూడా  ఎటువంటి రుసుము లేకుండా 1 సంవత్సరం పాటు Google AI Pro  అలాగే 140+ దేశాల విద్యార్థులకు ఎటువంటి రుసుము లేకుండా 1 సంవత్సరం పాటు Google AI Plus  అని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది. మాములుగా గూగుల్ ఏఐ ప్లస్ సబ్స్క్రిప్షన్ ధర రూ.399గా ఉంటుంది. గూగుల్ ఏఐ ప్లస్ లో స్టూడెంట్స్ కోసం వివిధ సదుపాయాలను గూగుల్ కల్పిస్తుంది. జెమినై లైవ్ కూడా అందుబాటులో ఉంటుంది. అర్హత కల్గిన స్టూడెంట్స్  పర్సనల్ గూగుల్ అకౌంట్తో గూగుల్ వన్లో సైన్ అప్ కావొచ్చు. స్టూడెంట్స్ ఎలిజిబిలిటీని  గూగుల్ షీర్ ఐడి  ప్లాట్ ఫామ్ ద్వారా వెరిఫై చేయనుంది. విద్యార్థులకు గూగుల్ ఏఐ ప్లస్ (Google AI Plus) ఒక అద్భుతమైన డిజిటల్ లెర్నింగ్ పార్ట్‌నర్‌గా ఉపయోగపడుతుంది. క్లిష్టమైన అకడమిక్ పాఠాలను సులభంగా అర్థం చేసుకోవడంలో ఇది ఉపయుక్తంగా ఉంటుంది. మ్యాథ్స్, సైన్స్,  కోడింగ్ ఇలా ఏవైనా అర్ధం కానీ టాపిక్స్ లో సందేహాలు ఉన్నప్పుడు లేదా పెద్ద పెద్ద కాన్సెప్టులను అర్థం చేసుకోవడం కష్టమైనప్పుడు, ఈ ఏఐ టూల్ వాటిని చాలా సరళమైన భాషలో చక్కగా వివరిస్తుంది. రెగ్యులర్ చదువులతో పాటు అసైన్‌మెంట్లు, రీసెర్చ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో గూగుల్ ఏఐ ప్లస్ ఎంతో సాయపడుతుంది. వ్యాసాలు, నివేదికలు రాయడానికి కావాల్సిన కొత్త ఆలోచనలను అందించడం,గ్రామర్ మిస్టేక్స్  సరిచేయడం మరియు భాషని మరింత ఇంప్రూవ్ చేసుకునేందుకు కూడా ఇది తోడ్పడుతుంది. అలాగే, పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో విద్యార్థులకు ప్రాక్టీస్ ప్రశ్నలు, క్విజ్‌లు ఇలా ఎన్నో విషయాల్లో స్టూడెంట్స్ కు ఉపయోగకరంగా ఉంటుంది. అకడమిక్స్ మాత్రమే కాకుండా, విద్యార్థుల వ్యక్తిగత ప్రాజెక్టులు మరియు భవిష్యత్తు నైపుణ్యాల అభివృద్ధికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుత ఏఐ యుగంలో ఎటువంటి విషయాన్నైనా సులభంగా నేర్చుకోవడంలో సాయపడుతుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *