చిరు, అనిల్ రావిపూడి మూవీ టైటిల్ ఇదే..!

Spread the love

మెగాస్టార్ చిరంజీవి స్పీడు మామూలుగా లేదు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే.. మరో సినిమాని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇంకో మూవీని అనౌన్స్ చేసారు. ఇదిలా ఉంటే.. చిరు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. అలాగే అనిల్ రావిపూడితో చేస్తున్న మూవీకి సంబంధించి టైటిల్ ఫైనల్ చేశారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ.. చిరు తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి..? అనిల్ తో చేసే మూవీ టైటిల్ ఏంటి..? తెలుసుకోవాలి అనుకుంటున్నారా..? అయితే.. ఈ స్టోరీ చూడాల్సిందే.

చిరంజీవి భోళా శంకర్ అనే రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రీమేక్ చేస్తే జనాలు చూడడం లేదు. కథ ముందుగా తెలిసిపోవడం వలన రీమేక్ సినిమాలు ఆడడం లేదు. అందుకనే ఇకపై రీమేక్ సినిమాలు చేయకూడదని చిరు ఫిక్స్ అయ్యారట. అలాగే రొటీన్ కమర్షియల్ సినిమాలకు కూడా నో చెబుతున్నారట. అందుకనే కొత్తగా ఉందనే ఉద్దేశ్యంతోనే.. విశ్వంభర మూవీకి ఓకే చెప్పారట. ఈ మూవీకి సంబంధించి ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది. త్వరలో ఈ భారీ సోషియో ఫాంటసీ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారని సమాచారం.

ఇక అనిల్ రావిపూడితో చేస్తోన్న మూవీ టైటిల్ విషయానికి వస్తే.. సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం.. అనే టైటిల్ అనుకుంటున్నారని తెలిసింది. ఈ మూవీ అనౌన్స్ మెంట్ సందర్భంగా వీడియో రిలీజ్ చేశారు. అందులో సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం అని అన్నారు అనిల్ రావిపూడి. ఇక తాజాగా ఈ సినిమాలో నయనతార నటిస్తుందని తెలియచేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. అందులో నయనతార కూడా సంక్రాంతికి రఫ్పాడించేద్దాం అని చెప్పడం జరిగింది. దీనిని బట్టి ఇదే టైటిల్ ఫిక్స్ చేశారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా ఈ టైటిల్ నే ఫిక్స్ చేస్తారేమో చూడాలి.