
బిగ్ బాస్ రియాల్టీ షో ఓ సంచలనం. ఈ రియాల్టీ షో తెలుగు రాష్ట్రాల్లో విశేషాదరణ పొందింది. ప్రతి సీజన్ లో రికార్డ్ టీఆర్పీ రేటింగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే.. గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ 9 సీజన్ గురించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. అది ఏంటంటే.. ఈసారి బిగ్ బాస్ హోస్ట్ మారబోతున్నారని.. బాలయ్యను కాంటాక్ట్ చేశారని గుసగుసలు వినిపించాయి. ఆతర్వాత బాలయ్య కాదు.. యూత్ ని మరింతగా ఆకట్టుకోవడం కోసం విజయ్ దేవరకొండను రంగంలోకి దింపనున్నారని టాక్ వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9కు కూడా నాగార్జునే హోస్ట్ గా చేయనున్నారనేది ఇండస్ట్రీ లీక్. ఇంతకీ.. బిగ్ బాస్ సీజన్ 9 వెనుక ఏం జరుగుతోంది..? ఈసారి హోస్ట్ ఎవరు…?
బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. అయితే.. అప్పుడు బిగ్ బాస్ సెట్ ముంబాయిలో వేయడం.. ప్రతివారం ముంబాయి వెళ్లాల్సిరావడంతో ఎన్టీఆర్ నెక్ట్స్ సీజన్ నుంచి తప్పుకున్నారు. అప్పుడు నేచురల్ స్టార్ నాని సెకండ్ సీజన్ కు హోస్ట్ గా చేయడం జరిగింది. నాని సక్సెస్ ఫుల్ గానే ఈ రియాల్టీ షోను డీల్ చేసినా.. ఎందుకనో తప్పుకున్నాడు. ఇక మూడో సీజన్ నుంచి ఎనిదవ సీజన్ వరకు అంటే.. వరుసగా ఆరు సీజన్స్ కు టాలీవుడ్ కింగ్ నాగార్జునే హోస్ట్ గా చేసి.. ఈ రియాల్టీ షోను మరింత ఆసక్తిగా.. మరింతగా వ్యూయర్స్ కు దగ్గరయ్యేలా చేసారు.
అయితే.. బిగ్ బాస్ 9 కు రంగం సిద్దమౌతుంది. ఈసారి హోస్ట్ గా నాగార్జున కాదు.. బాలయ్యను తీసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. ప్రచారంలో ఉన్నట్టుగా బాలయ్యను కాంటాక్ట్ చేశారట కానీ.. ఎందుకనో సెట్ కాలేదని టాక్ వినిపిస్తోంది. ఆతర్వాత విజయ్ దేవరకొండను తీసుకోవాలి అనుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే.. విజయ్ ను కాంటాక్ట్ చేశారో లేదో తెలియదు కానీ.. బిగ్ బాస్ 9కు కూడా హోస్ట్ కింగ్ నాగార్జునే అనేది ఎక్స్ క్లూజీవ్ న్యూస్. త్వరలోనే దీనికి సంబంధించి అఫిషయిల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని.. ప్రొమో కూడా రెడీ అవుతుందని సమాచారం. మరి.. ఈసారి బిగ్ బాస్ 9 తో టీఆర్పీ రేటింగ్ లో ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తారో చూడాలి.