మరోసారి తన స్టార్ పవర్ చూపిన సూర్య…ఆకట్టుకుంటున్న కరుప్పు

Spread the love

సూర్య  నటించిన ‘కరుప్పు’  విడుదలైన మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. తమిళంలో ‘కరుప్పు’ పేరుతో విడుదలైన ఈ చిత్రం.. తెలుగులో ‘వీరభద్రుడు’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. దర్శకుడు ఆర్.జె.బాలాజీ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లతో ప్రదర్శించబడుతోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌ పై నిర్మాతలు ఎస్.ఆర్.ప్రభు, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు భారీ స్థాయిలో నిర్మించారు.  సినిమాలో నటించిన ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని ప్రేక్షకులు చెబుతున్నారు. ఆర్.జె.బాలాజీ, ఇంద్రన్స్, స్వశిక, శివదా నాయర్, యోగి బాబు, మన్సూర్ అలీ ఖాన్, ఆడుకాలం నరేన్, వంటి నటులు సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించి కథకు బలం చేకూర్చారు. సాంకేతికంగా కూడా ‘కరుప్పు’ సినిమా మంచి స్పందన తెచ్చుకుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాలకు మరింత నిండుదనం  తీసుకొచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే నేపథ్య సంగీతం  ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక స్టంట్ మాస్టర్ విక్రమ్  రూపొందించిన యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మే 14న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా సూర్య నటన, కథలోని భావోద్వేగాలు, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘వీరభద్రుడు’కి మంచి స్పందన లభిస్తోంది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ‘కరుప్పు’ మంచి జోరు చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టినట్లు సమాచారం. ఇక రాబోయే రోజుల్లో వీకెండ్, హాలిడే కలెక్షన్లు కూడా కలిస్తే ఈ సినిమా మరింత భారీ వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ‘కరుప్పు’ సినిమాతో సూర్య మరోసారి తన స్టార్ పవర్ ఏంటో నిరూపించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *