సీనియర్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ ప్రతి సినిమాలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ అదరగొడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు అందుకోవడమే గాక యువతలో కూడా మంచి క్రేజ్ సంపాదించాయి. ముఖ్యంగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ డైలాగ్స్, పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇప్పుడు కొరటాల శివ సినిమాలో బాలయ్య మరో సరికొత్త పాత్రలో ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలకృష్ణ పాత్రకు ప్రత్యేకమైన లుక్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త మేకోవర్ తో బాలయ్య పూర్తిగా కొత్తగా కనిపించబోతున్నారనే టాక్ ఇప్పుడు అభిమానుల్లో మరింత ఆసక్తిని కలిగిస్తోంది.
ఈ లుక్ కోసం ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ఆలీమ్ హకీమ్ ప్రత్యేకంగా పని చేస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలకు స్టైలిష్ మేకోవర్స్ ఇచ్చిన ఆలిమ్ హాకిమ్ ఇప్పుడు బాలయ్య కోసం కూడా డిజైన్ రెడీ చేస్తున్నారట. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల లుక్స్‌ను పూర్తిగా మార్చేసిన అతను ఇప్పుడు బాలకృష్ణను మరింత స్టైలిష్ గా చూపించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాలయ్య డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉండబోతుందట. ఇప్పటివరకు అభిమానులు చూడని అల్ట్రా స్టైలిష్ మాస్ అవతార్‌లో నటసింహం కనిపించనున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఆగష్టు నెలలో ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. బాలయ్య ఇమేజ్ కు సరిపోయే స్థాయిలో పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది. అయితే ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదని ఎమోషన్స్ కు కూడా చాలా ప్రాధాన్యం ఉంటుందని టాక్ వినిపిస్తోంది. కొరటాల శివ సినిమాలంటే సాధారణంగా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్స్, సమాజానికి మంచి మెసేజ్ కూడా ఉంటాయి.