మన తీరంపై మనకే పూర్తి హక్కులు:ఏపీ సీఎం చంద్రబాబు

Spread the love

మన తీరం పై మనకే హక్కులని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.  పొరుగు రాష్ట్రాలు రావడానికి లేదని బోటు చొరబడగానే కలెక్టర్ కు  మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాగానే అలెర్ట్ అయి ఎవరినీ రానివ్వమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో ‘మత్స్యకారులు సేవ’ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో ‘మత్స్యకారుల సేవలో’ పేరిట రూ.20 వేల చొప్పున చేయూత అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చరిత్రలో మొట్టమొదటి సారి భారీగా ‘మత్స్యకారుల సేవలో’ నిధులు జమ చేశారు. ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేట నిషేధ సమయం. ఈ సమయంలో మత్స్యకారులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోందన్నారు. మొత్తం 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. మత్స్యకారులకు ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని పునరుద్ఘాటించారు. వేట నిషేధ సమయంలో రూ.20 వేలు ఆర్థిక భరోసా అందిస్తున్నామన్నారు. చరిత్రలో మొదటి సారి  రూ.260 కోట్లు మత్స్యకారుల ఖాతాల్లో వేశాం. గతేడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్ల సాయం అందించాం. ఈరోజు 1,30,796 కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయం అందించామన్నారు.  2014-19లో మత్స్యసంపద ఉత్పత్తి 19.18శాతం పెరిగింది. అయితే గత వైసీపీ  హయాంలో నాలుగు రెట్లు పడిపోయిందన్నారు. వ్యవసాయం, నిర్మాణ రంగం తర్వాత ఆ స్థాయిలో  మత్స్య సంపదపైనే ఎక్కువ మంది ఆధారపడ్డారని దేశంలో రొయ్యల ఉత్పత్తిలో 80శాతం ఏపీ నుంచే ప్రపంచానికి ఎగుమతి అవుతున్నాయని గుర్తు చేశారు.  సముద్రపు నీటితో సీవీడ్ కల్చర్ చేస్తే ఆదాయం బాగా వస్తుందన్నారు. మగవాళ్లు వేటకు వెళితే.. మహిళలు సీవీడ్ పండించాలని సూచించారు.  మహిళలకు ఆదాయం పెంచే మార్గాలు సూచించారు. మత్స్యకారుల జీవితాలు మెరుగుపడాలని అలా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, ఫరూఖ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *