ఒకప్పుడు అమెరికా నుండి ఒక చిన్న అధికారి వస్తున్నాడంటేనే ఇక్కడ రెడ్ కార్పెట్లు, హంగామా కనిపించేది. ఆ స్థాయిలో అదిరిపోయే ఆతిథ్యాలు ఉండేవి. వాషింగ్టన్ మెప్పు కోసం ఢిల్లీ పాలకులు తెగ తాపత్రయపడేవారు. కానీ, కాలం మారింది.. కాలంతో పాటు భారత్ దౌత్య నీతి రూపురేఖలూ మారాయి. ఇప్పుడు అమెరికా అంటే లైట్ తీసుకునే రేంజ్‌కు భారత్ చేరుకుంది. ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారతదేశ పర్యటన అప్పటికీ ఇప్పటికీ భారత్ ఇచ్చిన ప్రాధాన్యతలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. టారిఫ్‌ల పేరుతో, ‘డెడ్ ఎకానమీ’ అంటూ భారత్‌పై విషం కక్కిన డొనాల్డ్ ట్రంప్ వైఖరికి.. మన దేశం ఇచ్చిన గట్టి కౌంటర్ ఇది. తమతో పెట్టుకుంటే తలవంచే ప్రసక్తే లేదని, అమెరికాకే వణుకు పుట్టించిన నయా భారత్ తీరుకు ఇది సరికొత్త నిదర్శనం.
ఒకప్పుడు భారీ హంగామా .. ఇప్పుడు అలా కాదు
ఒకప్పుడు అమెరికా పెద్దన్న భారత్ కు వస్తున్నాడంటే ఇక్కడ హడావుడి మామూలుగా ఉండేది కాదు. వాషింగ్టన్ నుండి వైట్ హౌస్ ప్రతినిధులు వస్తే చాలు, రెడ్ కార్పెట్స్ తో వెల్కమ్ చెప్పేవారు. అప్పట్లో అమెరికా వీఐపీలకు ప్రత్యేక రాజభోగాలు కల్పించేవారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, ప్రపంచ రాజకీయాల్లో భారత్ స్థానం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. నిన్నగాక మొన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో దేశంలోకి అడుగుపెడితే ఆ పాత హడావుడి ఎక్కడా కనిపించలేదు. సూటు, బూటు వేసుకుని వచ్చిన రూబియోకు ప్రధాని కానీ, కీలక మంత్రులు అక్కడ స్వాగతం పలకలేదు. కేవలం కొద్దిమంది అధికారులు మాత్రమే విమానాశ్రయంలో ఫార్మాలిటీ పూర్తి చేశారు.
ఇక్కడ సీన్ రివర్స్
నిజానికి మార్కో రూబియో (marco rubio) ఈ పర్యటనను తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూశాడు. అమెరికాలో రాబోయే నవంబర్ ఎన్నికల్లో పోటీ పడుతున్న ఆయన, ఇక్కడి పర్యటనతో మైలేజ్ సాధించాలనుకున్నాడు. అందుకే ఢిల్లీ కంటే ముందుగా కోల్‌కతా ల్యాండ్ అయి, మదర్ థెరిసా చారిటీ సంస్థలను సందర్శించాడు. ఆయన ప్లాన్ అంతా పక్కాగా ఉన్నా ఇక్కడ సీన్ రివర్స్ అయింది. చారిటీల సాకుతో అమెరికాలోని క్రైస్తవ ఓటర్ల విశ్వాసం పొందాలనేది రూబియో అసలు వ్యూహం. ఈ భేటీలను అమెరికా మీడియాలో గొప్పగా ప్రచారం చేయించుకుని ఎన్నికల్లో లాభపడాలని ఆశపడ్డాడు. కానీ భారతదేశం ఇప్పుడు ఇలాంటి అంతర్గత రాజకీయ వ్యూహాలకు వేదికగా మారడానికి సిద్ధంగా లేదు. కోల్‌కతాలో ఏదో నాలుగు మాటలు మాట్లాడి మీడియా ఫోకస్ దక్కించుకున్నా, అసలు కథ ఢిల్లీలోనే మొదలైంది. భారత్ గడ్డపై తన పప్పులు ఉడుకుతాయని ఆశించిన రూబియోకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా పెద్దన్నల పాత పప్పులు ఇప్పుడు నడవవని ఈ పర్యటనతో స్పష్టమైపోయింది.
భారత్ తగ్గేదే లే…
కోల్‌కతా పర్యటన ముగిశాక అసలైన చర్చల కోసం రూబియో ఢిల్లీ వేదికపై అడుగుపెట్టాడు. ఇండియా ఎక్కడా తగ్గకుండా, తన సార్వభౌమత్వాన్ని చాటుతూ అమెరికా ముఖం మీదే నిజాలు చెప్పేసింది. ఒకప్పటిలా అమెరికా మాటలకు తలూపే భారత్ ఇప్పుడు లేదని ఢిల్లీ గట్టిగానే నిరూపించింది. రూబియోకు భారత్‌లో ఇలాంటి అనుభవం ఎదురుకావడానికి ప్రధాన సూత్రధారి డొనాల్డ్ ట్రంప్. గతంలో భారత్, అమెరికా బంధం ఎంతో బలంగా ఉన్నప్పటికీ, ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కథ మారింది. మిత్రదేశం అని చెప్పుకుంటూనే భారత్ ఆర్థిక ప్రయోజనాలపై ట్రంప్ దెబ్బకొట్టాడు. టారిఫ్ (tariff )ల విధింపు, చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌ను ఇరుకున పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. అంతటితో ఆగకుండా, భారతదేశాన్ని ఒక డెడ్ ఎకానమీ అంటూ అంతర్జాతీయ వేదికలపై విమర్శలు గుప్పించాడు. మన దేశ సంస్కృతిని, ఆర్థిక వ్యవస్థను తక్కువ చేస్తూ లేకి మాటలు మాట్లాడాడు. ట్రంప్ చేసిన ప్రతీ వ్యాఖ్యను, పెట్టిన ప్రతీ ఇబ్బందిని భారత్ కూడా సీరియస్ గానే తీసుకున్నట్లు కనిపించింది. సమయం చూసి దెబ్బకు దెబ్బ కొట్టాలనే వ్యూహంతోనే రూబియో పర్యటనను లైట్ తీసుకుంది. అమెరికా వైఖరి మారనంత వరకు తమ మర్యాదలు కూడా ఇలాగే ఉంటాయని భారత్ చెప్పకనే చెప్పింది.
ట్రంప్ ‘డెడ్ ఎకానమీ’ కామెంట్స్.. భారత్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్:
అమెరికా పాలకుల అహంకారానికి భారత్ ఇచ్చిన ఈ దౌత్యపరమైన షాక్ ఒక బలమైన హెచ్చరిక. ఇకపై తమతో పెట్టుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని ప్రపంచ దేశాలకు గట్టి సందేశం (strong message) పంపింది. ఒకప్పుడు అమెరికా పేరు చెబితేనే ఒదిగిపోయే భారత్, ఇప్పుడు అమెరికానే వణికే పరిస్థితిని తెచ్చింది. అంతర్జాతీయ రాజకీయాల్లో తాము ఎవరికీ లొంగేది లేదని ఈ చర్యతో స్పష్టమైంది. సమానత్వ ప్రాతిపదికన గౌరవం ఇస్తేనే ఇక్కడ మర్యాదలు దక్కుతాయని భారత్ నిరూపించింది. తలవంచి నిలబడే రోజులు పోయాయని, తల ఎత్తుకుని ప్రశ్నించే నవభారతం ఇదని చాటిచెప్పింది. ఇకనైనా అమెరికా తన పంథా మార్చుకోకపోతే అంతర్జాతీయంగా ఒంటరి కాక తప్పదు. ఇకనైనా అమెరికా తన పాత పెద్దన్న పాత్రను పక్కనబెట్టి.. మారిన భారతదేశ వాస్తవికతను గుర్తించక తప్పదు. ఒకప్పుడు బెదిరిస్తే లొంగిపోయే కాలం నాటి భారత్ వేరు.. ప్రయోజనాలే పరమావధిగా దూసుకుపోతున్న నేటి నవభారతం వేరు. టారిఫ్‌ల పేరుతో బ్లాక్‌మెయిల్ చేసినా.. ‘డెడ్ ఎకానమీ’ అంటూ చులకనగా మాట్లాడినా.. దేనికైనా దెబ్బకు దెబ్బ తగులుతుందని ఢిల్లీ వేదికగా భారత్ రుచి చూపించింది. మార్కో రూబియో పర్యటన ద్వారా వైట్ హౌస్ (white house) కు ఒక గట్టి సందేశం వెళ్ళింది.. తమను తక్కువ అంచనా వేస్తే మర్యాదలు కూడా ఇలాగే శూన్యంగా ఉంటాయని భారత్ తేల్చి చెప్పేసింది. తమతో పెట్టుకుంటే తలవంచే ప్రసక్తే లేదని, అంతర్జాతీయ వేదికలపై సమాన గౌరవం ఇస్తేనే స్నేహ హస్తం అందుతుందని స్పష్టం చేసింది. మరి ఇప్పటికైనా ట్రంప్ ప్రభుత్వం తన అహంకారాన్ని వీడి.. భారత్‌తో సమానమైన మైత్రిని కొనసాగిస్తుందా.. లేక దౌత్యపరమైన ఒంటరితనంలోకి జారుకుంటుందా అన్నది కాలమే నిర్ణయించాలి.