పాక్ పై దాడులు తీవ్రతరం చేసిన బీఎల్ఏ

Spread the love

పొరుగు  దేశం పాకిస్థాన్ ఒకవైపు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంటే, మరోవైపు బలూచిస్థాన్ ప్రావిన్స్ మరింత ఉద్రిక్తంగా మారుతోంది. పాకిస్థాన్ సైన్యంపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. బలూచిస్థాన్ అపారమైన ఖనిజ సంపదకు పెట్టింది పేరు. కానీ పాకిస్థాన్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించకుండా, చైనాతో కలిసి సీపెక్ ప్రాజెక్టుల పేరుతో ఆ వనరులను నిలువునా దోచుకుంటోంది. తమకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని, తమ వనరులపై తమకే హక్కు ఉండాలని బలూచ్ ప్రజలు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో పాక్ ఆర్మీ అక్కడ ఎంతో మంది బలూచ్ యువకులను, మేధావులను అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతోంది, బలవంతంగా అదృశ్యం చేస్తోంది. ఈ దారుణమైన అణచివేతకు వ్యతిరేకంగానే బీఎల్‌ఏ ఈ స్థాయిలో సాయుధ పోరాటం చేస్తోంది.  గత 8 రోజుల్లో ఏకంగా 22 దాడులు చేసి, 26 మంది పాక్ సైనికులను మట్టుబెట్టింది. బలూచిస్థాన్ స్వాతంత్య్రం  కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇటీవల తమ దాడుల వేగాన్ని మరింత తీవ్రతరం చేసింది. గత ఎనిమిది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 22 దాడులకు పాల్పడినట్లు బీఎల్‌ఏ స్వయంగా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ దాడుల్లో పాకిస్థాన్ సైనిక సిబ్బంది, పోలీసులు, మిలిటరీ కాన్వాయ్‌లు, ప్రభుత్వ అనుకూల సాయుధ బృందాలనే వాళ్లు ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారు. ఈ వరుస దాడుల్లో పాకిస్థాన్ సైన్యానికి చెందిన సుమారు 26 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని, పలువురు తీవ్రంగా గాయపడ్డారని బీఎల్‌ఏ వర్గాలు తెలిపాయి.  అంతేకాకుండా, ఒక సైనికుడిని సజీవంగా తమ అదుపులోకి తీసుకున్నట్లు చెప్పడం పాక్ ప్రభుత్వానికి  ఆగస్టు 9న చాగాయ్ ప్రాంతంలో నోక్ చాహ్ సమీపంలో వాణిజ్య వాహనాలను ఆపి తనిఖీ చేయడం ద్వారా ఈ దాడుల పరంపర మొదలైంది. ఆ తర్వాత ఆగస్టు 10న ఖారన్ హైవేపై జోమి వద్ద పోలీసులను తాత్కాలికంగా నిర్బంధించి, ఏకంగా పేలుడు పదార్థాలతో ఒక పోలీస్ పోస్టును పూర్తిగా ధ్వంసం చేశారు. ఇక ఆగస్టు 11న బులేదాలోని సురాప్‌లో పక్కా ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా.. పాక్ ప్రభుత్వ అనుకూల సాయుధ బృందపు స్థావరంపై దాడి చేసి దాని నాయకుడిని మట్టుబెట్టారు. అదే రోజు కలత్‌లోని రోడెన్‌జోలో సైనిక కాన్వాయ్‌పై ఒక భారీ ఐఈడీ  దాడి జరిగింది. ఈ ఒక్క దాడిలోనే ఏకంగా 17 మంది పాక్ జవాన్లు మరణించినట్లు బీఎల్‌ఏ వెల్లడించడం సంచలనంగా మారింది.  ఈ దాడులతో పాక్ సైన్యం తేరుకునే లోపే బీఎల్‌ఏ మరిన్ని దాడులకు తెగబడింది. ఆగస్టు 13న పంజ్‌గుర్‌లో పోలీస్ లైన్‌పై ఒక శక్తివంతమైన గ్రెనేడ్ దాడి జరిగింది. ఆ తర్వాత రోజే, అంటే ఆగస్టు 14న పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజు  ఒక సైనిక కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని పేల్చేశారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు మరణించారు.  నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఆగస్టు 15న సారాబ్ ప్రాంతంలో రెండు సైనిక పోస్టులను, అలాగే సైన్యానికి కీలకమైన ఒక వంతెనను కూడా పేల్చివేసినట్లు బీఎల్‌ఏ ప్రకటించింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *