పీఓకే సరిహద్దుల్లో పాకిస్తాన్ కు ఝలక్..ప్రజల్లో భారత్ పై అపార ప్రేమ

Spread the love

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ సరిహద్దుల వెంబడి ఆ దేశ పాలకులకు నిత్యం గట్టి ఎదురుదెబ్బలే తగులుతున్నాయనేది కాదనలేని వాస్తవం. ఎంతగా అణచివేత చర్యలకు పాల్పడుతున్నప్పటికీ, అక్కడి స్థానిక ప్రజలు ఏమాత్రం భయపడకుండా తమ నిరసనలను గళమెత్తి చాటుతున్నారు. పాకిస్తాన్ దేశం ఇటీవల తమ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్న వేళ, అక్కడి ప్రజలు ఊహించని విధంగా భారీ షాకిచ్చారు. భారత-పాకిస్తాన్ సరిహద్దు ఎల్‌వోసీ సమీపంలోని కెరన్ ,  కుప్వారా ప్రాంతాల్లో ప్రజలు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చారు. ఇండియన్ ఆర్మీ జిందాబాద్, హిందుస్తాన్ జిందాబాద్ అంటూ అక్కడి ప్రాంతం మార్మోగిపోయేలా నినాదాలు చేశారు. అంతేకాకుండా దేశభక్తికి ప్రతీక అయిన సారే జహాసె అచ్చా గీతాలాపనచేశారు. పాకిస్తాన్‌ పాలకులకు తమ నిరసన గొంతు స్పష్టంగా వినిపించేలా లౌడ్ స్పీకర్లు పెట్టి మరీ నినాదాలతో హోరెత్తించారు. తమ చేతుల్లో జాతీయ పతాకాలను బిగించి పట్టుకుని నినాదాలు చేయడంతో కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారం తప్పని ఋజువైంది.

పాకిస్తాన్ గత అనేక దశాబ్దాలుగా కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై, మీడియాలో, డిప్లమాటిక్ వర్గాల్లో పూర్తిగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ వస్తోంది. స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, భారత సైన్యం అక్కడ అణచివేత ధోరణితో వ్యవహరిస్తోందని నిత్యం అబద్ధపు వాదనలను వినిపిస్తూ ఉంటుంది. అయితే కెరన్, కుప్వారా వంటి సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లో మన సైనికులు అత్యంత స్వేచ్ఛగా, అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో జాతీయ నినాదాలు చేయడం ఆ ప్రచారాలకు గట్టి దెబ్బ కొట్టింది. సైనికులు నేరుగా సరిహద్దు వెంబడి నిలబడి, అవతలి వైపు స్పష్టంగా వినిపించేలా ఈ దేశభక్తి కార్యక్రమం నిర్వహించారు. ఇది సరిహద్దు వెంబడి ఉన్న శత్రువులకు మేము ఇక్కడ అత్యంత సురక్షితంగా, బలంగా ఉన్నామనే విషయాన్ని చాటిచెప్పింది. అంతేకాకుండా కశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలోనే అంతర్భాగం అనే  సత్యాన్ని ఈ చర్య ద్వారా మరోసారి ప్రపంచానికి చాటారు. ఇక ఇటీవల ఒక ఉగ్రవాది ఇంటిపై కూడా ఆ ఉగ్రవాది తల్లిదండ్రులు జాతీయ జెండా ఎగురవేయడంతో భారత్ పై అక్కడి ప్రజలకు ఎంత విశ్వాసం ఉన్నాయో చాటిచెబుతోంది. ఇలాంటి సాహసోపేత చర్యలు పాకిస్తాన్ సాగిస్తున్న తప్పుడు ప్రచారాలను మూలాల నుంచి తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *