మేము జెన్ జీ (Gen Z)… ఇటువంటి చేష్టలను సహించం అంటూ కార్గిల్ లో రహదారి మూసివేతపై ఆర్మీని నిలదీసిన ఒక మహిళా టూరిస్ట్ చర్యపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరీ దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమించే సైనికులపై ఇటువంటి స్వరంతో మాట్లాడడంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కార్గిల్ ప్రాంతంలోని మీనామార్గ్‌లో రహదారి మూసివేత విషయంలో ఒక మహిళా టూరిస్ట్ భారత సైనికులతో వాగ్వాదానికి దిగడం తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా “మేము జెన్ జీ… ఇటువంటివి సహించం” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ సంఘటన కార్గిల్ జిల్లాలోని మీనామార్గ్ చెక్‌పోస్ట్ వద్ద చోటుచేసుకుంది. ఆమె “మేము జెన్ జీ, ఈ ఇటువంటి వాటిని మేము సహించం” అని పెద్ద స్వరంతో మాట్లాడటం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడిన తర్వాత, దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమించే సైనికుల పట్ల ఆమె చూపిన అగౌరవంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై మాజీ ఆర్మీ చీఫ్, ప్రస్తుతం మిజోరాం గవర్నర్‌గా ఉన్న జనరల్ వీకే సింగ్ స్పందించారు. భారత సాయుధ దళాలు మన దేశానికి, దేశానికి హాని తలపెట్టాలని చూసే శక్తులకు మధ్య రక్షణ గోడలా నిలబడతాయి. మీనామార్గ్ సంఘటన మన సైనికుల ధైర్యం, త్యాగం మరియు నిరంతర నిఘాకు ఒక నిదర్శనం. పరిస్థితులు ఏవైనాప్పటికీ, మన సైనికులను అన్యాయంగా నిందించడం లేదా గౌరవించకపోవడం తప్పు. విమర్శ అనేది భావోద్వేగాలు లేదా విచక్షణారహితమైన ఆరోపణల ఆధారంగా కాకుండా, వాస్తవాల ఆధారంగా ఉండాలి. భారతదేశం కోసం సేవ చేస్తూ, త్యాగాలు చేస్తున్న మన సైనికులకు మేము అండగా నిలుస్తాము అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటన సైనికుల త్యాగాలను, దేశభక్తిని మరోసారి చర్చకు తెచ్చింది. లడఖ్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలు దేశ భద్రతకు అత్యంత కీలకం. సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దులను కాపాడుతుంటారు. వారి ప్రతి కదలిక, ప్రతి నిబంధన దేశ భద్రత దృష్ట్యానే ఉంటుందని అర్థం చేసుకోవాలి. జనరల్ వీకే సింగ్‌తో పాటు, ఇతర సైనిక ప్రముఖులు కూడా ఈ ఘటనను ఖండించారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఈ వీడియోపై స్పందించారు. “మేము జెన్ జీ” అనే పదం ఇప్పుడు “జాంతే నహీ హో మేరా బాప్ కౌన్ హై” అన్నట్లుగా మారిందని, తరాల లేబుల్‌ను బెదిరింపుగా ఉపయోగించకుండా జాగ్రత్త వహించాలని ఆయన హెచ్చరించారు. ఈ ఘటన సైనిక నిబంధనలను పాటించాల్సిన ఆవశ్యకతను, పౌరులలో జవాబుదారీతనాన్ని గుర్తుచేస్తుంది.ఈ సంఘటన తర్వాత, సైనిక సిబ్బందితో పౌరులు ఎలా వ్యవహరించాలి అనే దానిపై అవగాహన అవసరం మరింత పెరిగింది. దేశ భద్రతకు సంబంధించిన విషయాలలో నిబంధనలను పాటించడం, సైనికులను గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, పౌరులకు సైనిక కార్యకలాపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలి. ముఖ్యంగా యువతలో దేశభక్తిని, సైనికుల పట్ల గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాలు అవసరం. సైనికులు దేశానికి వెన్నెముక. వారి త్యాగాలను ఎప్పటికీ విస్మరించకూడదు. ఈ సంఘటన భవిష్యత్తులో ప్రజలు సైనిక సిబ్బంది పట్ల మరింత బాధ్యతాయుతంగా, గౌరవంగా వ్యవహరించడానికి ఒక గుణపాఠం కావాలి.