ప్రపంచ దేశాల ముందు ఉగ్రవాదాన్ని అణిచివేస్తున్నాం అని చెప్పే పాకిస్తాన్.. తెరవెనుక అటువంటి అసాంఘిక శక్తులకు ఎలా కాపాడుతుందో మరోసారి బట్టబయలైంది. కేవలం 15 నెలల క్రితం, పాకిస్తాన్ గడ్డపైకి వెళ్లి.. ఉగ్రవాదుల గుండెల్లో నిద్రపోయి, వాళ్ల స్థావరాలను ‘ఆపరేషన్ సింధూర్’ తో పెకిలించి వేసిన మన భారత సైన్యం దెబ్బను పాక్ అప్పుడే మర్చిపోయింది. గతేడాది ఆపరేషన్ సిందూర్ దెబ్బకు.. పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్పూర్‌లో ఉన్న జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయం ధ్వంసమైంది. కానీ, ఇప్పుడు పక్కా ప్లానింగ్‌తో, కోట్లాది రూపాయల నిధులతో ఆ ఉగ్ర ఫ్యాక్టరీని పాకిస్తాన్ మళ్లీ నిర్మించి ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన మర్కజ్ సుభాన్ అల్లా బేస్‌ను.. ఇప్పుడు సరికొత్త హంగులతో, ఆధునిక వసతులతో పునరుద్ధరించారు.
పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్పూర్ అనగానే జైష్-ఎ-మొహమ్మద్ ముష్కరులకు అదొక ట్రైనింగ్ అడ్డా. 18 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఉస్మాన్-ఓ-అలీ క్యాంపస్.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడుల్లో తీవ్రంగా ధ్వంసమైంది. కానీ 15 నెలల తర్వాత, ఈ కేంద్రం ఇప్పుడు మళ్లీ పూర్తి స్థాయిలో ఆపరేషన్స్‌లోకి వచ్చింది. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు యాక్సెస్ చేసిన తాజా శాటిలైట్ , గ్రౌండ్ విజువల్స్ ప్రకారం.. దాడుల్లో దెబ్బతిన్న ప్రధాన హాల్‌లోని గోతులను కాంక్రీట్‌తో పూడ్చేశారు. పాడైపోయిన డోమ్స్ ను తిరిగి నిర్మించి, కొత్తగా మార్బుల్ ఫ్లోరింగ్, అడ్వాన్స్‌డ్ పెయింటింగ్ వేశారు. ఈ మొత్తం పునర్నిర్మాణం కోసం పాకిస్తాన్ అధికార యంత్రాంగం ఏకంగా 25 కోట్ల పాకిస్తానీ కరెన్సీని విడతల వారీగా నగదు రూపంలో జైషే ఉగ్రవాదులకు అందించింది. ఇందులో 11 కోట్లను కేవలం సెంట్రల్ హాల్ నిర్మాణం కోసమే ఖర్చు చేశారు. అంటే, భారత్ చేసిన దాడుల తాలూకు ఆనవాళ్లు ఏవీ కనిపించకుండా పక్కాగా కవర్ చేసే ప్రయత్నం జరిగింది. కేవలం 15 నెలల్లోనే ఒక ఉగ్ర స్థావరాన్ని ప్రభుత్వమే దగ్గరుండి నిర్మించి ఇచ్చిందంటే.. వాళ్ల కుట్ర ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2025 ఏప్రిల్‌లో పహాల్గమ్ లో మన పోరులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో పీఓకే, పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత దళాలు విరుచుకుపడ్డాయి. అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెయిన్ టార్గెట్.. ఈ
బహవల్పూర్ ప్రధాన కార్యాలయమే. రాత్రికి రాత్రే జరిగిన ఈ సర్జికల్ దాడుల్లో ఆ క్యాంపస్ కుప్పకూలింది.ఈ దాడుల్లో జైషే వ్యవస్థాపకుడు మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది బంధువులు, కీలక కమాండర్లతో సహా మొత్తం 13 మంది ముష్కరులు ఈ దాడుల్లో హతమయ్యారు. ఉగ్రవాదులకు బ్రెయిన్ వాష్ చేసే మద్రసా అల్-సాబిర్ భవనాలు, కమాండర్ల నివాసాలు నేలమట్టం అయ్యాయి. ఆ దెబ్బతో జైష్ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ పాక్ ఆర్మీ సపోర్ట్‌తో మళ్లీ ఇప్పుడు అది ప్రాణం పోసుకుంది. ఇక్కడ విస్మయానికి గురిచేసే అంశం ఈ బహవల్పూర్ క్యాంప్ ఉన్నది పాక్ ఆర్మీ 31 కార్ప్స్ కంటోన్మెంట్‌కు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే. అంటే మిలిటరీ కనుసన్నల్లోనే వీళ్ల ట్రైనింగ్ నడుస్తోంది. మరి ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ ఎక్కడున్నాడు? ఈ కొత్త క్యాంప్‌ను ఎవరు ఆపరేట్ చేస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు.ప్రస్తుతం జైషే చీఫ్ మసూద్ అజార్ తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు. అతన్ని, మరో సీనియర్ లీడర్ రవూఫ్ అస్గర్‌ను పాక్ ప్రభుత్వం సింధ్ ప్రావిన్స్‌లోని నవాబ్‌షా జిల్లాలో ఒక సేఫ్ హౌస్‌లో అత్యంత భద్రత మధ్య దాచిపెట్టింది. వాళ్లు లేకపోవడంతో బహవల్పూర్ సెంటర్‌ను రీబిల్డ్ చేసే బాధ్యతను మసూద్ సోదరులు తల్హా అల్-సైఫ్, మొహినుద్దీన్ ఔరంగజేబ్ లు తమ భుజాలపై వేసుకున్నారు. వీళ్ల డైరెక్షన్‌లోనే ఇప్పుడు కొత్త ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్, ఆయుధ శిక్షణ , బ్రెయిన్ వాష్ లాంటి కార్యక్రమాలు మళ్లీ ముమ్మరంగా సాగుతున్నాయి. 2001 పార్లమెంట్ దాడి, 2016 పఠాన్‌కోట్, 2019 పుల్వామా దాడులకు ప్లాన్ గీసింది ఈ బహవల్పూర్ సెంటర్‌లోనే అన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు మళ్లీ ఈ ఫ్యాక్టరీ రన్ అవుతుండటం భారత భద్రతా బలగాలకు పెద్ద సవాల్. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కుప్పకూలిన బహవల్పూర్ క్యాంప్ మళ్లీ పునరుజ్జీవం పోసుకోవడం వెనుక ఉన్న పాక్ ఏదో ప్లాన్ చేస్తోందని అర్థమవుతోంది. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తే ఆ పాము ఒకరోజు వాళ్లనే కాటేస్తుందన్న వాస్తవాన్ని పాకిస్తాన్ మర్చిపోయింది. అయితే, ఇండియా కూడా గతంలో లాగా సైలెంట్‌గా ఉండే పరిస్థితి లేదు. ఉగ్ర స్థావరం మళ్లీ యాక్టివ్ అయ్యిందన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ నేపథ్యంలో.. బోర్డర్లో మన సైన్యం ఎలర్ట్ అయ్యింది. ముష్కరులు ఏమాత్రం రెడ్ లైన్ క్రాస్ చేసినా.. మరోసారి బహవల్పూర్ బేస్‌ను స్మశానంగా మార్చడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెనకాడదు.