‘రణబాలి’ రిలీజ్ డేట్ ప్రకటన 

Spread the love

విజయ్ దేవరకొండ.. ఈ పేరు వినగానే యువతలో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అతికొద్ది మంది నటుల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తన నటనతో  ఎదిగి, రౌడీ స్టార్‌గా అభిమానుల మనసుల్లో నిలిచిపోయాడు.  కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ పెళ్లి చూపులు సినిమాతో విజయాన్ని అందుకుని ఆ తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో సుస్థిర స్థానం సంపాదించి వరుసగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకెళ్తున్నాడు.

ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల్లో ‘రణబాలి’ ఒకటి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రష్మిక మంథన హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్నాల్డ్ ఓస్లూ విలన్ గా కనిపించనున్నారు. అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన అప్డేట్స్ ఆసక్తిని పెంచేశాయి. ఇక ఈ సినిమా విడుదల తేదీని మూవీ టీమ్ నేడు ప్రకటించింది. అక్టోబర్ 16న విడుదల చేయనున్నట్లు తెలిపింది. విజయ్ దేవరకొండ కెరీర్ ఇప్పుడు ఒక కీలక దశలో ఉంది. ఆయన నుంచి అభిమానులు మరిన్ని విభిన్నమైన కథలను, ప్రయోగాత్మక చిత్రాలను ఆశిస్తున్నారు. నటుడిగా తన మార్కును నిలబెట్టుకుంటూనే, నిర్మాతగా కూడా విజయ్ తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. తన ఎంపికలతో, నటనతో, వ్యక్తిత్వంతో విజయ్ దేవరకొండ యువతకు ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయన రాబోయే చిత్రాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వివాహం తరువాత రష్మిక మంథన, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తుండడం, హాలీవుడ్ నటుడు విలన్ గా నటిస్తుండడంతో ఈ సినిమాపై క్రేజ్ నెలకొంది. రష్మిక విజయ్ ఫ్యాన్స్ ఎంతగానో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా ప్రకటించడంతో సోషల్ మీడియా వేదికగా తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా భారీ విజయం అందుకుంటుందంటూ తమ విషెస్ తెలుపుతున్నారు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాపై ట్రేడ్ విశ్లేషకులు కూడా ఆసక్తిగా ఉన్నారు. దసరా సీజన్ సందర్భంగా వస్తుండడం కూడా ఈ సినిమాకు కలిసొస్తుందని భావిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *