భారత్ వేదికగా  జరగనున్న మొట్టమొదటి ఐసీసీ ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ 

Spread the love

మొట్ట మొదటి మహిళల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2027లో జరగాల్సిన ఈ టోర్నీకి శ్రీలంక ఆతిథ్యమివ్వాల్సి ఉండగా…అయితే ఆ దేశ పాలనా సమస్యల కారణంగా టోర్నీని మరో దేశంలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. సౌతాఫ్రికా, భారత్, బంగ్లాదేశ్ లో నిర్వహించే అవకాశాలు పరిశీలించిన ఐసీసీ భారత్ కు హోస్టింగ్ రైట్స్ ఇచ్చింది. పురుషుల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 50 ఓవర్ల ఫార్మాట్ లో జరుగుతుండగా…ఉమెన్స్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఫిబ్రవరి 14 నుండి 28 వరకు జరగనున్న ఈ టోర్నీకి ముంబై, వడోదరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఉమెన్స్ టీ 20 క్రికెట్ లో ఈ సంవత్సరం జులై 6నాటికి మొదటి 6 స్థానాల్లో ఉన్న టీమ్ లు ఈ టోర్నీలో తలపడతాయి. ఇందులో భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంకల అర్హత సాధించాయి. సింగిల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో సాగే ఈ టోర్నీలో ప్రతి జట్టు మిగతా ఐదు జట్లతో తలపడుతుంది. లీగ్ దశ ముగిసేసరికి పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా ఫైనల్ పోరుకు అర్హత సాధిస్తాయి. ఫిబ్రవరి 28న జరిగే తుది పోరుతో టోర్నీ ముగుస్తుంది.భారతదేశంలో మహిళా క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈ టోర్నీ దక్కడం శుభపరిణామం. గత కొద్ది సంవత్సరాలుగా భారత మహిళా జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. స్వదేశీ గడ్డపై జరిగే ఈ పెద్ద టోర్నీ యువ ఆటగాళ్లకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. బోర్డు తీసుకుంటున్న చర్యలు మహిళా క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకువెళ్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్టేడియాలకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చి క్రీడాకారిణులను ప్రోత్సహించే అవకాశం ఉంది. ముంబై, వడోదరలలో ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ టోర్నీని అత్యంత విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దేశవాళీ టోర్నీలతో పాటు అంతర్జాతీయ సిరీస్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, మహిళా క్రికెట్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఈ బాధ్యతను స్వీకరించింది. ఆటగాళ్ల ఫిట్‌నెస్, రక్షణ మరియు వసతి ఏర్పాట్లపై బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది.

ముంబైలోని చారిత్రాత్మక క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా స్టేడియం అలాగే వడోదరలోని వడోదర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికలుగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. దేశంలోని రెండు ప్రముఖ నగరాల్లో ప్రపంచ స్థాయి ఉమెన్స్ క్రికెటర్స్  తలపడనుండటం విశేషం.ప్రతి ఏటా ఒక ప్రధాన ఐసీసీ మహిళా టోర్నీ నిర్వహించడంతో  ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు మరింత మెరుగైన క్రీడా వినోదం లభిస్తోంది. గత ఏడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్‌ను భారత మహిళల జట్టు కైవసం చేసుకున్న నేపథ్యంలో, ఇప్పుడు మరో పెద్ద టోర్నీకి ఆతిథ్యం ఇస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *