సింధూ జలాలను చక్కగా వినియోగించుకునే విధంగా లదాఖ్ (Ladakh) లోని ఉప్సీ ప్రాంతంలో భారత్ మొదటి రాతి డ్యామ్ ను కట్టింది. సిమెంట్ వాడకుండా రాతితో కట్టిన ఈ డ్యామ్ తో నదిలో వాటర్ లెవెల్ కూడా 10 అడుగులు పెరిగింది. ఇక చాలాకాలంగా నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న ఆ ప్రాంతంలో వారికి సాగునీరు అందనుంది. ఈ చెక్ డ్యామ్ తో 40 మిలియన్ లీటర్ల నీటిని స్టోర్ చేసే కెపాసిటీ కలిగి ఉంది. ఈ నిర్మాణంతో రైతులకు ఉపశమనం కలగనుంది. నది నీటిని మరింత సమర్థవంతంగా ఒడిసిపట్టే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ఈ ప్రాంతంలో చాలా కాలంగా వసంతకాల సాగు సమయంలో నీటి కొరత తీవ్రంగా ఉండేది. దీనిని దృష్టిలో ఉంచుకుని స్థానిక రైతుల కష్టాలను తీర్చడానికి ఈ ప్రయత్నం చేపట్టారు. సుమారు 11,400 అడుగుల ఎత్తైన ఈ అత్యున్నత పర్వత ప్రాంతంలో సముద్ర మట్టానికి ఎదురయ్యే సవాళ్లను తట్టుకుంటూ కేవలం ఏడు రోజుల్లోనే ఈ నిర్మాణం పూర్తి చేయడం విశేషం. పూర్తిగా ప్రకృతి సిద్ధంగా లభించిన బండరాళ్లను మాత్రమే ఉపయోగించి ఈ చెక్ డ్యామ్‌ను నిర్మించడం విశేషం. సిమెంట్ వాడకం లేనప్పటికీ ఇది అత్యంత పటిష్టంగా నిలిచింది. ఈ రాతి నిర్మాణ ప్రభావం వల్ల సింధూ నదిలో నీటి మట్టం సుమారు 10 అడుగుల మేర పెరగడం దీనిద్వారా సుమారు 40 మిలియన్ లీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు చేకూరింది. సుమారు 180 మెట్రిక్ టన్నుల భారీ రాళ్లను ఒకదానితో ఒకటి ఇంటర్‌లాక్ చేస్తూ నది ప్రవాహాన్ని నియంత్రించేలా ఈ శాస్త్రీయ పద్ధతిని ఫాలో అయ్యారు. ఈ వినూత్న ప్రాజెక్టు పూర్తిగా పర్యావరణ సమతుల్యతను కాపాడేలా రూపొందించడం పట్ల పర్యావరణవేత్తలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా స్థానిక సరిహద్దు గ్రామాల అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతోంది. అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాలలో నీటి భద్రతను పెంపొందించడంలో ఈ తరహా ఇంజనీరింగ్ అద్భుతాలు భవిష్యత్తులో మార్గదర్శకంగా నిలుస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చెక్ డ్యామ్ ద్వారా నిల్వ అయిన నీటిని ఇగూ ఫేయ్ సాగునీటి కాలువ నుండి నేరుగా వ్యవసాయ పొలాలకు మళ్లిస్తున్నారు. గతంలో నీటి వనరులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న స్థానిక రైతులకు ఇప్పుడు సాగునీరు అందడం పట్ల రైతాంగం నుండి హర్షం వ్యక్తమవుతోంది. సుదూర గ్రామాలలో వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు స్థానిక ప్రజల జీవనోపాధిని మెరుగుపరించేందుకు ఇది దోహదం చేస్తోంది. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంతో లదాఖ్ యంత్రాంగం భవిష్యత్తుపై మరింత దృష్టి పెట్టింది.