జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులతో ప్రధాని మోదీ భేటీ

Spread the love

ఈరోజు టీచర్స్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ స్థాయిలో ఉత్తమ టీచర్లుగా ఎంపికైన వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రధానంగా విద్యార్థుల దైనందిన జీవితంలో మారుతున్న అలవాట్లపై చర్చ జరిగింది. ముఖ్యంగా పిల్లల్లో పెరుగుతున్న స్క్రీన్ టైమ్ లేదా డిజిటల్ వ్యసనాలను తగ్గించే దిశగా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. చదువుతో పాటు విద్యార్థులలో దాగివున్న క్రియేటివిటీని  వెలికితీసి వారిని సరైన మార్గంలో నడిపించడంలో గురువులదే అసలైన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.ఈ ఏడాది దేశవ్యాప్తంగా నూతన పద్ధతులలో బోధన సాగిస్తున్న మరియు మారుతున్న విద్యా ప్రమాణాలకు అనుగుణంగా 48 మంది పాఠశాల ఉపాధ్యాయులను జాతీయ అవార్డుల కోసం ఎంపిక చేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కఠినమైన వడపోత ప్రక్రియ తర్వాత ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలకు వీరు ఎంపికయ్యారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీరు ఈ పురస్కారాలు అందుకోనున్నారు. సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తగ్గిపోతున్న ఈ రోజుల్లో టీచర్సే స్టూడెంట్స్ సరైన దారిలో నడపాలన్నారు. మాదక ద్రవ్యాల అంశంపై మాట్లాడుతూ పిల్లలు ఏం చేస్తున్నారు? ఎలాంటి అలవాట్లు చేసుకుంటున్నారనే దానిని గమనిస్తూ ఉండాలన్నారు. స్టూడెంట్స్ తమ కలలను నెరవేర్చుకోవడంలో టీచర్స్ కీలక పాత్ర పోషిస్తారన్నారు. ఇక 

ప్రతి స్టూడెంట్ లో ఏదొక ప్రతిభ దాగి ఉంటుందని దానిని గుర్తించి ప్రోత్సహిస్తే వారు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని అలాగే  పిల్లలను తరగతి గదికే పరిమితం చేయకూడదని  వారిని బయటకు తీసుకువెళ్లి సమాజంలో జీవించే నైపుణ్యాలు, సమాజ పరిస్థితులపై అవగాహన కల్పించడం కూడా ముఖ్యమని పేర్కొన్నారు.  సిలబస్ తో  పాటు నైతిక విలువలూ నేర్పాలని ప్రధాని మోదీ టీచర్స్ కు సూచించారు. మారుతున్న కాలానికి తగినట్లుగా  విద్యారంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు టీచర్స్ కూడా తమ టీచింగ్ శైలిని మార్చుకుంటున్నారు. కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా నైతిక విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాబోయే కాలంలో విద్యార్థులను మరింత బాధ్యతాయుతమైన సమర్ధవంతమైన  పౌరులుగా తయారుచేయడంలో టీచర్స్ అనుభవం ఎంతో దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యువతలో దేశభక్తితో పాటు  శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంలో టీచర్స్ మార్గదర్శకత్వం కీలకమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *