ఈ నెల నుండి భారత జట్టు క్రికెట్ సిరీస్ లు వరుసగా ఉండనున్నాయి. ఈ నెల 13న ఆఫ్ఘనిస్థాన్ తో మూడు టీ 20ల సిరీస్ ఆ తరువాత ఆసియా గేమ్స్, ఆ తర్వాత వెస్టిండీస్ తో వన్డే సిరీస్, టీ 20 సిరీస్ జరగనుంది. సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 17 వరకు ఈ సిరీస్ జరగనుంది. ఇక ఇది పూర్తైన తరువాత భారత్ న్యూజిలాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లనుంది. 2019 తరువాత భారత్ న్యూజిలాండ్ లో పర్యటిస్తుండడంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సిరీస్ కు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఈ పర్యటనలో భాగంగా భారత్ న్యూజిలాండ్ తో 5 వన్డేలు, 5 టీ 20లు, 2 టెస్టు మ్యాచ్ లు ఆడనుంది. ఈ సిరీస్ టికెట్లు భారీగా సేల్ అవుతున్నాయి. భారీ స్పందన రావడం పట్ల న్యూజిలాండ్ క్రికెట్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించి టికెట్ల అమ్మకాలు ప్రారంభమైన రెండు వారాల్లోనే యాభై వేలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. క్రైస్ట్‌చర్చ్‌లోని హ్యాగ్లీ ఓవల్ మైదానంలో జరగనున్న రెండో టీ20 మ్యాచ్ టికెట్లు ఇప్పటికే డెబ్బై ఐదు శాతం వరకు అమ్ముడుపోయయని వార్తలు వస్తున్నాయి. రాబోయే ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ పర్యటనలోని ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారనుందని అభిమానులు భావిస్తున్నారు. విదేశీ పిచ్‌లపై ముఖ్యంగా పేస్ మరియు బౌన్స్ ఎక్కువగా ఉండే కివీస్ పరిస్థితుల్లో భారత యువ ఆటగాళ్లు ఏమేరకు రాణిస్తారనే ఆసక్తి నెలకొంది.
అక్టోబర్ 22న తొలి టీ20 క్రైస్ట్ చర్చ్ లో జరగనుంది. అక్టోబర్ 24న రెండో టీ20 కూడా అక్కడే జరగనుంది. ఇక అక్టోబర్ 27న మూడో టీ20 వెల్లింగ్టన్లో అక్టోబర్ 30న నాలుగో టీ20 ఆక్లాండ్ వేదికగా జరగనుండగా..నవంబర్ 1న ఐదో టీ20 హామిల్టన్ లో జరగనుంది. ఇక వన్డే సిరీస్ విషయానికి వస్తే ఆక్లాండ్ నవంబర్ 4న తొలి వన్డే, వెల్లింగ్టన్ లో నవంబర్ 7న రెండో వన్డే, హామిల్టన్ వేదికగా నవంబర్ 10న మూడో వన్డే, నవంబర్ 13న నాలుగో వన్డే మౌంట్ మౌంగనుయి వేదికగా అలాగే నవంబర్ 15 ఐదో వన్డే మౌంట్ మౌంగనుయిలో జరగనున్నాయి. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కీలకమైన టెస్టు సిరీస్ నవంబర్ 19 నుండి మొదలు కానుంది. మొదటి టెస్ట్ 23 వరకు జరగనుంది. వెల్లింగ్టన్ లో మొదటి టెస్టు జరగనుంది. నవంబర్ 27 నుండి డిసెంబరు 1 వరకు క్రైస్ట్ చర్చ్ వేదికగా రెండో టెస్టు జరగనుంది.