కొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తున్న కొద్దీ డిజిటల్ ప్రపంచంలో సరికొత్త ప్రయోగాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒకప్పుడు గతం గురించి తలచుకోవడానికి పాత ఫోటోలే ఆధారం కాగా, ఇప్పుడు ఏఐ సహాయంతో ఆ రోజులను మళ్ళీ కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఏఐ వింటేజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరూ ఈ ట్రెండ్‌ను ఆస్వాదిస్తూ తమ క్రియేటివిటీ చాటుకుంటున్నారు.ఈ ఏఐ యుగంలో రోజుకొక సరికొత్త ట్రెండ్ ఆకట్టుకుంటోంది. ఏఐ వింటేజ్ ట్రెండ్ 80స్ లుక్ లో సెలెబ్రెటీల నుండి సామాన్యుల వరకు అదరగొడుతున్నారు. నెట్టింట ఈ సరికొత్త ట్రెండ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమ తమ అభిమాన నటులు, నటీమణులు ఎలా ఉంటారో ఈ ట్రెండ్ లో అంటూ నెటిజన్లు వారి ఫోటోలను ఆ జెనరేషన్ కు తగినట్లుగా ఏఐతో జెనరేట్ చేసి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇక ఈ ట్రెండ్ లో పొలిటిషియన్ల ఫోటోలు కూడా ఆకర్షిస్తున్నాయి. ఇక తాజాగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా తన 80స్ ట్రెండ్ ఇమేజ్ ను పోస్ట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
టెక్నాలజీ రెవల్యూషన్ మరియు పాత జ్ఞాపకాల కలయికతో అందరూ ఈ వైబ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. టెక్నాలజీ మారుతూ ఎంటర్టైనింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. గడిచిన కాలపు జ్ఞాపకాలను నేటి ఆధునిక సాంకేతికతతో కలపడం ద్వారా సరికొత్త అనుభూతి కలుగుతోంది. ఈ సరికొత్త ట్రెండ్‌లో భాగంగా యూజర్లు తమ ప్రస్తుత చిత్రాలను పాతకాలపు శైలిలోకి మారుస్తున్నారు. 1980వ దశకం నాటి డ్రెస్సింగ్ స్టైల్, కలర్స్ మరియు ఫోటోగ్రఫీ శైలిని కృత్రిమ మేధస్సు అద్భుతంగా పునఃసృష్టిస్తోంది. దీనివల్ల ప్రతి ఒక్కరూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను లేదా ఆనాటి స్టైల్‌ను మళ్ళీ చూసే అవకాశం లభిస్తోంది. చాట్‌జీపీటీ వంటి అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ అందుబాటులోకి రావడంతో ఈ వింటేజ్ ట్రెండ్ మరింత జోరుగా ఉంది. కేసోషల్ మీడియాలో ఈ ట్రెండ్ కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే ఇది మిలియన్ల కొద్దీ యూజర్లను ఆకర్షించింది.