యూపీఐ యూజర్లు ఇవి తెలుసుకోండి…!

Spread the love

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), కేంద్ర ప్రభుత్వం కలిసి తీసుకొచ్చిన యూపీఐ (UPI) కొత్త రూల్స్  మరియు ఛార్జీల ఫ్రేమ్‌వర్క్ అక్టోబర్ 15, 2026 నుండి అమలులోకి రానున్నాయి. సామాన్య వినియోగదారులకు ఎలాంటి భారం పడకుండా, డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ ను మరింత పటిష్టం చేయడానికి ఈ మార్పులు చేశారు. కొందరు భయపడుతున్నట్లు ఎక్కువగా ఛార్జీలు పడతాయా లేదా అనేది చూద్దాం. దేశంలో దాదాపు 96% సాధారణ మర్చంట్ లావాదేవీలపై ఎలాంటి ప్రభావం పడదు, ఎందుకంటే అవి రూ. 2,000 లోపు ఉండేవే కాబట్టి. ఇక సాధారణ ప్రజలు ఒకరికొకరు చేసుకునే మనీ ట్రాన్స్‌ఫర్‌లపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఎంత మొత్తాన్ని పంపినా అది ఉచితమే. అక్టోబర్ 15, 2026 నుండి రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని ఎంపిక చేసిన మర్చంట్ (వ్యాపార) ట్రాన్సాక్షన్ లపై   0.4% మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వర్తిస్తుంది. ఈ 0.4% ఛార్జీని కేవలం వ్యాపారులు మాత్రమే భరించాల్సి ఉంటుంది. కస్టమర్ల నుండి ఈ ఛార్జీని వసూలు చేయకూడదని బ్యాంకులు, మర్చంట్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే క్యూఆర్ కోడ్ పేమెంట్ల ద్వారా నెలకు రూ.1 లక్ష వరకు ఆదాయం పొందే చిన్న వ్యాపారులకు ఈ కొత్త నిబంధనల నుండి మినహాయింపు ఇవ్వడం గమనార్హం. ఇది వారికి ఊరట కలిగించే అంశం. అలాగే రూ. 2,000 పైబడిన భారీ లావాదేవీలపై విధించే గరిష్ట ఛార్జీని రూ. 300 గా నిర్ణయించారు. అంటే రూ. 75,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తానికి గరిష్టంగా రూ. 300 మాత్రమే కట్ అవుతుంది. రైల్వే టికెట్లు, కరెంట్  బిల్లులు, మున్సిపల్ వాటర్ బిల్లులు, గ్యాస్ మరియు ఇంధనం (Fuel) వంటి పబ్లిక్ యుటిలిటీ బిల్లులు రూ. 2,000 దాటితే పర్శంటేజ్ ప్రకారం కాకుండా కేవలం రూ. 5 ఫ్లాట్ ఛార్జీ పడనుంది. సర్వర్లపై లోడ్ పడకుండా అలాగే సాంకేతిక లోపాలను అరికట్టడానికి బ్యాంకింగ్ యాప్స్‌లో ఒక రోజుకు అంటే 24 గంటలకు  గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకునేలా పరిమితి ఉండనుంది. సబ్‌స్క్రిప్షన్లు, ఈఎంఐల కోసం పెట్టుకునే ఆటోపే  షెడ్యూల్డ్ పేమెంట్లు ఇకపై సర్వర్లు ఖాళీగా ఉండే రద్దీ లేని సమయాల్లో అంటే ఆఫ్ పీక్ అవర్స్ లో జరిగేలా సిస్టమ్‌ను మార్చారు. సాధారణ యూపీఐ లావాదేవీల రోజువారీ పరిమితి రూ. 1 లక్షగా కొనసాగుతుండగా, ఇన్సూరెన్స్, క్యాపిటల్ మార్కెట్ (ఇన్వెస్ట్‌మెంట్లు) వంటి స్పెషల్  కేటగిరీలకు రూ. 5 లక్షల వరకు అనుమతి ఉంది. కొత్త యూజర్లకు మొదటి 24 గంటల్లో గరిష్టంగా రూ. 5,000 మాత్రమే పంపుకునే పరిమితి ఉంటుంది. సెక్యూరిటీని ఇంకాస్త పెంచేందుకు పిన్ తో పాటు బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ వంటి అదనపు సెక్యూరిటీ లేయర్లను తప్పనిసరి చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *