సినిమా ఇండస్ట్రీ గ్లామర్ ప్రపంచం. ఇక్కడ స్టార్డమ్ ఎంత త్వరగా వస్తుందో, వాటి వెనుక విమర్శల కూడా అంతే వేగంగా దూసుకువస్తాయి. ఇక హీరోయిన్ల విషయంలో సోషల్ మీడియాలో జరిగే ట్రోల్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వాళ్ళు ఏం తిన్నా, ఎక్కడ కనిపించినా, ఏ డ్రెస్ వేసుకున్నా.. చివరికి వాళ్ళ శరీరంలో చిన్న మార్పు వచ్చినా సరే, భూతద్దంలో పెట్టి చూసి దారుణంగా విమర్శిస్తూ విచక్షణ లేకుండా ప్రవర్తించే వారు ఎందరో. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ ఎంతో మంది అభిమానుల కలల రాకుమారి అయిన కత్రినా కైఫ్ కు సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. నెటిజన్లు ఆమెపై తీవ్ర స్థాయిలో బాడీ షేమింగ్ కు పాల్పడుతున్నారు. కత్రినా కైఫ్ లుక్ అంతకముందు మాదిరి లేదని ఆమె బరువు పెరిగిందని రకరకాల కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియా లో దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే, ఈ వికృతమైన ట్రోలింగ్‌కు అడ్డుకట్ట వేస్తూ, కత్రినా కైఫ్ కు అండగా కొందరు నిలిచారు. ట్రోలర్స్‌కు వారు దిమ్మతిరిగే కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు ఇంటర్నెట్ లో అతిపెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఒక మహిళ జీవితంలో శారీరక మార్పులు రావడం చాలా సహజం. వయసు పెరిగే కొద్దీ, లేదా ఆరోగ్యపరమైన కారణాల వల్ల ముఖంలో, శరీరంలో మార్పులు వస్తాయి. కానీ సెలబ్రిటీ అనగానే 365 రోజులు, 24 గంటలూ మేకప్ వేసుకుని, జీరో సైజ్ లోనే ఉండాలని నెటిజన్లు ఎక్స్పెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? కత్రినా లాంటి ఒక స్టార్ హీరోయిన్ మీద ఇలా మూకుమ్మడిగా దాడి చేయడం నిజంగా నెటిజన్ల వికృత మానసిక స్థితికి అద్దం పడుతోంది. కత్రినా కైఫ్ మీద ఇలా దారుణంగా ట్రోలింగ్ జరుగుతున్న సమయంలో.. ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు.
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లపై బాడీ షేమింగ్ జరగడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా ఒక స్టార్ హీరోయిన్ గర్భవతిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత పాపకు జన్మనిచ్చినప్పుడు సహజంగానే కొంత బరువు పెరిగింది. అప్పుడు కూడా ఇదే సోషల్ మీడియా ఆమె అందాన్ని విమర్శిస్తూ దారుణమైన కామెంట్స్ చేసింది. అలాగే ఇంకా ఎంతో మంది స్టార్స్ తమ ప్రెగ్నెన్సీ లేదా పోస్ట్ ప్రెగ్నెన్సీ సమయంలో ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్నారు. ఒక ఆడపిల్ల ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే పునర్జన్మ ఎత్తడమే. ఆ క్రమంలో శరీరంలో హార్మోన్ల మార్పులు జరుగుతాయి.అవేమి పట్టించుకోకుండా మొబైల్ చేతిలో ఉంది కదా అని కామెంట్స్ పెట్టడం దారుణమని కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్న వారిపై మండిపడుతున్నారు. హీరోయిన్లు కూడా అందరి వంటి వారే. వాళ్ళకూ ఎమోషన్స్, శారీరక మార్పులు ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఈ మొత్తం ఎపిసోడ్ లో మనం కత్రినా కైఫ్ హుందాతనాన్ని కచ్చితంగా మెచ్చుకోవాలి. తన మీద ఇన్ని రూమర్స్ వస్తున్నా, ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నా ఆమె మాత్రం ఎక్కడా రియాక్ట్ అవ్వలేదు. పెళ్లికి ముందు ఎంతో బిజీగా సినిమాలు చేసిన కత్రినా.. విక్కీ కౌశల్ తో వివాహం జరిగిన తర్వాత తన పర్సనల్ లైఫ్ కు, ఫ్యామిలీకి ఎక్కువ సమయం ఇస్తోంది. ఆమె ఎంచుకునే సినిమాల సంఖ్య కూడా తగ్గింది. అయితే ఆమెకు మద్దతుగా నిలుస్తున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది.