ఆస్కార్ వేదికపై సత్తా చాటేందుకు భారతీయ సినిమా సిద్ధమైంది. ఆస్కార్ 2027 అవార్డ్స్ కోసం భారత్ నుండి అధికారిక ఎంట్రీ ఫైనల్ అయింది. 99వ అకాడమీ అవార్డులకు భారతదేశం తరపున అధికారిక ఎంట్రీగా మరాఠీ చిత్రం ‘గోంధాల్’ ఎంపికైనట్లు ప్రకటించారు. ఈ ఏడాది పోటీలో ఉన్న 30కి పైగా చిత్రాల నుండి ఈ సినిమాను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ ఎంపిక చేసింది. భారతదేశం తరపున అధికారిక ఎంట్రీ కోసం పోటీలో ఉన్న 33 చిత్రాలలో ‘మై వాపస్ ఆవుంగా’, ‘బోర్డర్ 2’ మరియు ‘ధురందర్’ వంటి భారీ హిట్ సిరీస్ లు కూడా ఉన్నాయి. డగ్ డగ్, హక్, భమర్డో, తేరా మేరా నాటా, 120 బహదూర్, సింగ్ గీతం, లడూ, ఓహ్ మై డాగ్, గోంధాల్, డియోల్ బ్యాండ్ 2, టిఘి, పెద్ది,బాలన్ ది బాయ్, ఇరుముడి, డోరతీ, ఖూంటా, గాంధీ టాక్స్, బైసన్ జి 20 ఆఫ్ కలామాడన్, షాపెనర్ జి20 కమాండో విన్ లవ్ స్టోరీ, ఇక్కిస్, ప్రవాస్, మ్యాన్ ఆటలే మనాట్లే, అబ్సెస్, ఎగ్వా, ఆంగ్ మరియు హనుమాన్ అన్ష్ లు ఉన్నాయి. 99వ అకాడమీ అవార్డుల్లో భారత్ నుండి ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో ప్రాతినిథ్యం వహించబోతోంది. నిపుణుల ఎంపిక కమిటీ బరిలో నిలిచిన సినిమాలన్నింటినీ పరిశీలించింది. ఈ పోటీలో హిందీ నుండి 14 చిత్రాలు, మరాఠీ, తెలుగు, గుజరాతి నుండి చెరో నాలుగు చొప్పున, తమిళం నుండి మూడు, మలయాళం, నాగసమీ నుండి ఒక్కొక్కటి చొప్పున పరిశీలనకు వచ్చాయి. అన్ని చిత్రాల ప్రదర్శనను నిశితంగా అంచనా వేసిన జ్యూరీ సభ్యులు, చివరికి గోంధాల్ సినిమాను సరైన సినిమాగా తేల్చారు.గతంలో కూడా పలు మరాఠీ చిత్రాలు ఆస్కార్ బరిలోకి దిగి దేశం గర్వపడేలా చేశాయి. ‘శ్వాస్’, ‘హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ’, ‘కోర్ట్’ చిత్రాల తర్వాత ఆస్కార్ బరిలోకి అడుగుపెడుతున్న నాల్గవ మరాఠీ చిత్రంగా గోంధాల్ ఘనత అందుకుంది. గత ఏడాది నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో వచ్చిన ‘హోంబౌండ్’ చిత్రం భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పరిశీలించిన 33 చిత్రాల్లో ‘ధూరందర్’, ‘హక్’, ‘ఇక్కిస్’, ‘అంగ్’ వంటి ప్రముఖ చిత్రాలు గట్టి పోటీనిచ్చినప్పటికీ, చివరికి జ్యూరీ గోంధాల్ వైపే ఆసక్తి చూపింది. ఇక మరి ఆస్కార్ బరిలో ఏస్థాయిలో సత్తా చాటుతుందనేది చూడాలి.