బెంగాల్ బై ఎలక్షన్…టీఎంసీ రెండు వర్గాలకు కేటాయించిన గుర్తులు ఇవే..!

Spread the love

పశ్చిమ బెంగాల్ లో ఉపఎన్నికల సందడి మొదలైంది. అక్కడ  నందిగ్రామ్ తోపాటు రెజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 6న ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే, తృణమూల్ కాంగ్రెస్ లో ఇటీవల జరిగిన పరిణామాల గురించి తెలిసిందే. పార్టీ  రెండు ముక్కలవడం తమదే అసలైన పార్టీ అని ఒక వర్గం ప్రకటించుకోవడంతో ఇరువర్గాల మధ్య వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో పార్టీ పేరు, దాని ఎన్నికల సింబల్ ను ఉపయోగించకూడదని ఇరువర్గాలకు ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో మాజీ సీఎం మమతా బెనర్జీ వర్గానికి పార్టీ పేరు ఖరారు చేసింది. ‘మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ అని ఖరారు చేశారు. వీరికి ‘ఫుట్ బాల్ ప్లేయర్’ గుర్తు కేటాయించింది. మరోవైపు టీఎంసీ రెబల్స్ వర్గానికి ‘డెమొక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్’ పేరును అలాగే ఎన్వలప్ సింబల్ ను కేటాయించింది. 

రాబోయే ఉపఎన్నికల పోరు పశ్చిమ బెంగాల్ లో మరింత రసవత్తరంగా మారింది. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన నందిగ్రామ్ అలాగే రెజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 6న  తేదీన పోలింగ్ ప్రక్రియ జరగనుంది. అదేవిధంగా అక్టోబర్ 9న న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ స్థానాల ఉపఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు నుండి  ప్రచారం వరకు అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి సువేందు అధికారి నందిగ్రామ్ స్థానాన్ని  వదులుకోవడం, అలాగే అజ్ప్ వ్యవస్థాపకుడు హుమాయున్ కబీర్ రెజీనగర్ స్థానానికి రాజీనామా చేయడం వల్ల ఈ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ  ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో  తృణమూల్ కాంగ్రెస్ వర్గపోరుతో ఎవరికి లాభం చేకూరుస్తుందనే అంశంపై రాజకీయ విశ్లేషకుల్లో జోరుగా చర్చ సాగుతోంది. స్థానిక ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఈ ఉపఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టత రానుంది. ఇక  ఈ రెండు స్థానాల పోలింగ్, రాబోయే సాధారణ ఎన్నికలకు ఒక దిశను చూపనుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. టీఎంసీలో  అంతర్గత విభేదాలు, రాష్ట్రాన్ని దశాబ్దాలుగా పాలించిన ఆ పార్టీ నిర్మాణాన్ని తీవ్రంగా బలహీనపరిచాయనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో ఏ వర్గం నిజమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందనేదానికి స్పష్టతనిస్తాయని భావిస్తున్నారు.ఎన్నికలు జరగనుంది కేవలం రెండు స్థానాలకే అయినప్పటికీ బెంగాల్ వ్యాప్తంగా ఉన్న రాజకీయ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *