ఇప్పటికే పెరిగిన ముడి చమురు ధరలతో సామాన్యుడు సతమతమవుతున్నాడు. రష్యా-ఉక్రెయిన్ ఒకపక్క, ఇజ్రాయెల్-ఇరాన్ ఇంకోపక్క ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తాయి. తాజా పరిణామాలు చూస్తుంటే పరిస్థితులు మళ్లీ ఎటువైపుకి దారితీస్తాయో అనే సందిగ్దత నెలకొంది. మూడు రోజుల్లో ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తాం అని మొదలెట్టిన రష్యా యుద్ధం కాస్తా.. మూడో ఏడు దాటి నాలుగో ఏడాదిలోకి పోతోంది. ఇక మిడిల్ ఈస్ట్ ది వేరో కథ. ఇరాన్ అమెరికా మధ్య నెలకొన్న పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి. ఇక్కడ మనకు కూడా అక్కడ ఉద్రిక్తతల వలన రేట్లు ఆకాశాన్ని తాకాయి. చివరకు ఈ పెరిగిన ఖర్చంతా ఎవరి ఖాతాలో పడుతుందో తెలుసా? ఉదయం లేస్తే మనం కొనే వంటనూనె ప్యాకెట్ దగ్గర్నుంచి, పిల్లల స్కూల్ బ్యాగ్ దాకా ప్రతిదాని ధరపైనా ప్రభావం చూపుతోంది. ఎక్కడో ఎవడో స్విచ్ నొక్కితే, ఇక్కడ సామాన్యుడి బడ్జెట్ పెరిగిపోతోంది.
మన దేశం వాడుకునే ముడి చమురులో దాదాపు 85% విదేశాల నుంచే రావాలి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర ఒక డాలర్ పెరిగితే చాలు.. మన ఖజానా నుంచి భారీగా విదేశీ మారకద్రవ్యం రూపంలో ఆవిరైపోతాయి. దానివల్ల రూపాయి డాలర్ ముందు వీక్ అవుతుంది. ఆర్బీఐ వాళ్లు ఎన్ని మంత్రాలు వేసినా, ప్రపంచ ద్రవ్యోల్బణం మన జీతాలను తినేస్తూనే ఉంటుంది. ఇలాంటి టైంలో మన భారత విదేశాంగ విధానం చూస్తే నిజంగా ప్రశంసలు కురిపించాల్సిందే. ఒక పక్క అమెరికా వచ్చి రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దు, ఆంక్షలు ఉన్న నేషన్స్ ఫస్ట్ నినాదంతో కేవలం మన దేశ ప్రయోజనాలే లక్ష్యంగా దౌత్యం నడుపుతోంది. ఇక్కడ కూడా ఆత్మనిర్భర్ భారత్, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు అడుగులు వేస్తున్నాం. కానీ ఇవన్నీ పూర్తిగా పట్టాలెక్కే లోపు.. ఈ ప్రపంచ యుద్ధోన్మాదులు మనల్ని ప్రశాంతంగా బతకనిస్తారా అన్నదే అసలు సిసలు మిలియన్ డాలర్ల ప్రశ్న! మొత్తానికి చూస్తే.. ఇది యుద్ధాల యుగం కాదు అని మన ప్రధాని అంతర్జాతీయ వేదికలపై ఎంత గట్టిగా చెప్పినా.. ఆ మాట వినే మూడ్‌లో ఎవరూ లేరు. ఎవరి రాకెట్లు వాళ్లు పేలుస్తూనే ఉన్నారు. ఈ మంటల్లో పడకుండా, ఎవరి పక్షం వహించకుండా భారత్ చేస్తున్న దౌత్య ప్రభావం ప్రస్తుతానికైతే అద్భుతంగానే సాగుతోంది. అయితే చివరకు పెట్రోల్ బంక్ దగ్గర నిలబడి పెట్రోల్ కొట్టించుకునే సామాన్యుడి బాధ ఎప్పుడు తీరుతుంది? ఈ అంతర్జాతీయ యుద్ధాల సెగ మనపై ఏమేరకు ప్రభావం చూపుతుందో చూడాలి మరి.
తాజా పరిణామాలు చూస్తే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం అత్యంత తీవ్రమైన స్థాయికి చేరుకుంది. దౌత్యపరమైన చర్చలు ఆగిపోవడంతో ఇరు దేశాలూ డ్రోన్లు, మిస్సైళ్లతో ఒకరి వ్యూహాత్మక స్థావరాలపై మరొకరు భారీ ఎటాక్స్ చేసుకుంటున్నాయి. గత రెండు రోజులుగా ఉక్రెయిన్ రష్యా భూభాగంపై 1,000 కి పైగా డ్రోన్లతో తన చరిత్రలోనే అతిపెద్ద వైమానిక దాడిని నిర్వహించింది. ఇందులో వందలాది డ్రోన్లు నేరుగా రాజధాని మోస్కోను లక్ష్యంగా చేసుకున్నాయి. ఉక్రెయిన్ దాడులకు ప్రతీకారంగా రష్యా కూడా కీవ్ మరియు ఇతర నగరాలపై డ్రోన్లు, మిస్సైల్స్ తో విరుచుకుపడుతోంది.