భారత్ కు షూటింగ్ లో గోల్డ్ వచ్చేసింది..!

Spread the love

ఆసియా గేమ్స్ (asian games) లో షూటింగ్ లో భారత్ గోల్డ్ తో సత్తా చాటింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్సెడ్ టీమ్ ఈవెంట్ లో భారత షూటర్లు కమల్ జీత్,సురుచి సింగ్ లు భారత్ కు గోల్డ్ ను అందించారు. దీంతో ఈ క్రీడల్లో భారత్ కు రెండో గోల్డ్ మెడల్ దక్కినట్లైంది. ఇంతకముందు భారత మహిళా క్రికెట్ జట్టు గోల్డ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. షూటింగ్ లో మెడల్ రౌండ్ లో మొత్తం నాలుగు జోడీలు ఫైనల్ కు క్వాలిఫై అయ్యాయి. ఇందులో కమల్ జీత్, సురుచి కలిసి మొత్తంగా 484.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. ఇక సౌత్ కొరియా సిల్వర్, ఇరాన్ జోడీకి బ్రాంజ్ లు గెలుచుకున్నాయి. 

ఈ గోల్డ్ మెడల్ (Gold Medal) తో ప్రస్తుత టోర్నమెంట్ లో భారత్ ఖాతాలో రెండో గోల్డ్ మెడల్ చేరినట్లైంది. వరుస విజయాలతో టోర్నమెంట్‌ లో భారత్ మెడల్స్ టాలీ మరింత మెరుగవ్వడమే కాకుండా, షూటింగ్ విభాగంలో భారత జాతీయ జట్టు సాధిస్తున్న పురోగతికి ఇది నిదర్శనంగా నిలిచింది. సరైన ప్రణాళిక, కఠిన శిక్షణ ఉంటే అంతర్జాతీయ స్థాయిలో విజయం ఎంత సునాయాసమో ఈ విజయం నిరూపించింది. కమల్ జీత్, సురుచి సింగ్ ల విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు రాజకీయ ప్రముఖులు, క్రీడా రంగానికి చెందిన దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు సోషల్ మీడియా వేదికగాఈ జోడీకి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు. ఈ విజయం భారత షూటింగ్ రంగానికి సరికొత్త ఆశలను, నమ్మకాన్ని ఇస్తోంది. రాబోయే పలు కీలక గేమ్స్ తో పాటు ప్రతిష్టాత్మక ఒలింపిక్ పోటీల్లో కూడా భారత్ భారీ సంఖ్యలో పతకాలు సాధించడానికి ఈ ఫామ్ ఒక గట్టి పునాదిగా ఉపయోగపడుతుందనే అభిప్రాయం క్రీడా విశ్లేషకుల నుండి వ్యక్తమవుతోంది. మొత్తానికి, ఆసియా కప్ షూటింగ్ విజయం భారత క్రీడల భవిష్యత్తుపై మరింత విశ్వాసాన్ని పెంచింది. ఆధునిక సాంకేతిక శిక్షణ, క్రీడా ప్రాధికారిక సంస్థల మద్దతు ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో భారత షూటర్లు ప్రపంచ వ్యాప్తంగా జరిగే ప్రధాన టోర్నమెంట్లలో మరిన్ని గోల్డ్ మెడల్స్ తో సత్తా చాటడం ఖాయమనే అభిప్రాయం అభిమానుల నుండి వ్యక్తమవుతోంది. ఇక, మెన్స్  50 మీటర్ల రైఫిల్ టిమ్ ఈవెంట్ లో భారత టీమ్ సిల్వర్ సాధించింది. ఫైనల్లో మన షూటర్లు ఐశ్వరీ ప్రతాత్ సింగ్ తోమర్, రుద్రాంశ్ పాటిల్, నీరజ్ కుమార్ మొత్తంగా 1762 పాయింట్లు సాధించారు. 1766 పాయింట్లతో చైనా టీమ్  గోల్డ్ గెలిచింది. కేవలం నాలుగు పాయింట్ల తేడాతో మన జట్టుకు కొంచెంలో గోల్డ్ మిస్సయింది. మరోవైపు స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్  లో  జోష్న చిన్నప్ప, సెంథిల్ కుమార్ మెడల్ ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్లో ఫిలిప్పీన్స్ కు చెందిన డేవిడ్ పెలినో-జెమైకా అరిబాడోను 11-3, 11-5 తో ఓడించి మన ఆటగాళ్లు సెమీస్ కు వెళ్లారు. దీంతో మెడల్ ఖరారైనట్లే. ఇక టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ ఈవెంట్లో భారత క్రీడాకారులు మనుష్ షా, దియా చితాలే కూడా మెడల్  ఖాయం చేసుకున్నారు. క్వార్టర్స్లో వీరు హాంకాంగ్ పై  11-6, 13-15, 11-9, 11-5తో గెలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *