జపాన్ లో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో సుదీర్ఘ కాలం తరువాత మారథాన్ లో భారత్ కు సిల్వర్ మెడల్ దక్కింది. 44 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన హవాల్దార్ సావన్ బర్వాల్ సిల్వర్ మెడల్ ను భారత్ కు అందించాడు. మెన్స్ మారథాన్ లో అతను 2:11:37 గంటలలో రేసును ముగించి తన ప్రతిభను కనబరిచాడు. 28 ఏళ్ల సావన్ ఆర్మీలో హవాల్దార్ గా సేవలందిస్తున్నాడు. రేసు ప్రారంభం నుండి జోరు చూపించాడు. 35 కిలోమీటర్ల మార్క్ వరకు ముందంజలో ఉన్నాడు. ఆఖరి 7 కిలోమీటర్లు కాస్త స్లో కావడంతో ద్వితీయ స్థానంతో ముగించాడు.
ఈ రేసులో జపాన్ కు చెందిన ఇచితాకా యమషితా 2:10:49 గంటల వ్యవధిలో పూర్తి చేసి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. కేవలం 48 సెకన్ల తేడాతో సావన్ కు గోల్డ్ చేజారింది. . ఇక, చైనాకు చెందిన పేయూకు గోల్డ్ మెడల్ దక్కింది. ఈ విభాగంలో సుదీర్ఘకాలం తరువాత భారత్ కు సిల్వర్ మెడల్ ను తీసుకొచ్చిన భారత క్రీడాకారుడిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఆసియా గేమ్స్ మారథాన్ విభాగంలో భారత్కు సిల్వర్ మెడల్ దక్కడమనేది సాధారణమైన విషయం కాదు. భారత్ లోని న్యూఢిల్లీ వేదికగా జరిగిన క్రీడల్లో 1951చోటా సింగ్ గోల్డ్ మెడల్ తో సత్తా చాటారు. ఇక అదే 1951 లోనే సూరత్ సింగ్ మాథుర్ కాంస్యం గెలుచుకున్నారు. 1982హోసూర్ కుక్కప్ప సీతారాం కాంస్యం (బ్రోంజ్) గెలుచుకున్నారు. ఆ తరువాత మెడల్ రాలేదు. దీనికోసం ఏకంగా 44 సంవత్సరాల సుదీర్ఘ కాలం వేచి చూడాల్సి వచ్చింది. ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, భారత మారథాన్ చరిత్రలో ఈ విజయం ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది.
దేశ రక్షణలో భాగస్వామిగా ఉంటూనే, క్రీడారంగంలోనూ తన అసాధారణ పట్టుదలతో జాతీయ పతాకాన్ని అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించాడు. ఈ మారథాన్ రేసులో సావన్ తన అత్యుత్తమ సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. క్రమం తప్పకుండా శ్రమించి, సైనిక క్రమశిక్షణతో సాధన చేయడం వల్లే అతను ఈ స్థాయిలో ప్రదర్శన ఇవ్వగలిగాడని క్రీడా విశ్లేషకులు భారత క్రీడాభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మారథాన్ ప్రారంభం నుండి సావన్ బర్వాల్ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ మొదటి నుండి రేసులో జోరు పెంచాడు. దాదాపు 35 కిలోమీటర్ల మార్క్ వరకు రేసులో ముందంజలో ఉండి అందరి దృష్టినీ ఆకర్షించడమే కాకుండా గోల్డ్ కు దగ్గరగా వెళ్లాడు. చివరి కిలోమీటర్లలో కాస్త స్లో కావడంతో, అతను మొదటి స్థానాన్ని స్వల్ప తేడాతో చేజార్చుకుని ద్వితీయ స్థానంతో రేసును ముగించాల్సి వచ్చింది. అయితే సుదీర్ఘ కాలం తర్వాత మారథాన్ విభాగంలో భారత్కు రజత పతకం తీసుకొచ్చిన సావన్ బర్వాల్పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. క్రీడా ప్రముఖులు మరియు అభిమానులు అతని ప్రతిభను కొనియాడుతూ, రాబోయే పోటీలలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.